ETV Bharat / state

వచ్చీ రాగానే వసూళ్ల బాట - వివాదాస్పదంగా పలువురు యువ ఐపీఎస్‌ల తీరు - Govt on Probationary Officers

Probationary IPS Officers Illegal Activities : చట్టాన్ని కాపాడాల్సిన ఐపీఎస్‌ అధికారులే, అడ్డదారులు తొక్కుతూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రొబేషనరీ దశలోనే కొందరు అక్రమాలకు తెరలేపారు. రాష్ట్రంలో పలువురు యువ ఐపీఎస్‌ల తీరు ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిపై చర్యలకు అతిక్రమించి ఒకరికి ఛార్జిమెమో మిగిలిన వారిని అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ చేసింది. తప్పు చేసే వారిని ఉపేక్షించవద్దని ఉన్నతాధికారులకు సుస్పష్టం చేసింది.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2024, 7:58 AM IST

Probationary IPS Officers Controversial Behavior
Probationary IPS Officers Illegal Activities (eenadu.net)

Probationary IPS Officers Controversial Behavior in Telangana : ఎన్నికల సమయంలో హైదరాబాద్​కు కీలకమైన విభాగానికి బదిలీపై వచ్చిన ఓ ఐపీఎస్​ అధికారిణి భారీగా వసూళ్లు మొదలపెట్టారు. ఎక్కడ డ్యూటీ చేసినా అక్కడ విల్లాల ధరలు గురించి ఆరా తీస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది ఆమెను విల్లా రాణిగా పిలుస్తారు. ఆమెపై ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌లోని కీలకస్థానం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడా కూడా ఆమె తీరు మారకపోవడంతో చర్యలు తీసుకునేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది.

అవినీతితో బోణీ : ఇదిలా ఉండగా మల్టీజోన్‌-2లో ఓ జిల్లా ఎస్పీగా నియమితులైన యువ ఐపీఎస్​ కూడా ఎన్నికల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నీ ఖర్చు చేసినట్లు చూపి అవినీతికి బోణీ చేశారు. ఆ తర్వాత ఖర్చుల కోసం కిందిస్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ ఐపీఎస్​ను రాష్ట్ర ప్రభుత్వం ఓ అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసింది. అంతకముందు సైబరాబాద్‌లో పనిచేసినప్పుడు ఆయన ఇలానే వసూలు చేసేవారని విచారణలో బయటపడింది.

ఇండియన్​ పోలీస్​ సర్వీస్(ఐపీఎస్‌) అఖిలభారత స్థాయిలో అత్యున్నత సర్వీస్‌. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు చట్టాల అమలులో వీరిది ముఖ్య భూమిక. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న ఐపీఎస్‌లలో కొందరి తీరు రాష్ట్రంలోనే వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కొత్తగా నియమితులైన కొందరు యువ ఐపీఎస్‌లు వసూళ్ల కోసమే అడ్డదారులు తొక్కుతుండటంతో ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో డ్యూటీలో చేరకముందే వసూళ్లు మొదలుపెట్టిన ఓ ఐపీఎస్‌కు ప్రభుత్వం ఛార్జిమెమో ఇచ్చింది. ఈ తరహాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని సైతం అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ చేసింది. తప్పు చేసేవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది.

భూవివాదాల్లో తలదూర్చి : తెలంగాణ కేడర్‌కు కేటాయించిన ఓ మహిళా ఐపీఎస్‌, ప్రొబేషనరీగా రాష్ట్రంలోని ఓ జిల్లాలో డ్యూటీ చేస్తూ సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఆ ఠాణా తన పరిధిలో లేకపోయినా సరాసరి స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ సీట్లో కూర్చొని, ఓ భూవివాదానికి సంబంధించి కేసు ఫైల్‌ తెమ్మని సిబ్బందిని ఆదేశించారు. ఆ సమయంలో ఆ ఐపీఎస్​తో అదే వివాదంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సైతం ఉండటం గమనార్హం. ఇలా కేసు ఫైల్‌ తేవడం నిబంధనలు ఒప్పుకోవని సిబ్బంది చెప్పినా ఆమె వినలేదు. తాను ఐపీఎస్‌నని, తన భర్త ఐఏఎస్‌ అని, తాము అనుకుంటే ఏమైనా చేస్తామని సిబ్బందిని బెదిరించారు. ఈ క్రమంలో కష్టం మీద స్టేషన్‌ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి పంపించారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆమెకు ఛార్జిమెమో ఇచ్చారు.

భూకబ్జాదారులకు డీసీపీ వత్తాసు : హైదరాబాద్‌ శివారులోని ఓ జోన్‌కు డీసీపీగా ఓ మహిళా నియమితులయ్యారు. కొంతకాలమే పనిచేసినా భూవివాదాల్లో వసూళ్లతో చెడ్డపేరు తెచ్చుకున్నారు. భూవివాదాల కేసుల్లో వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్రంలో ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌వోపీ) అమల్లో ఉంది. దీన్ని అపహాస్యం చేస్తూ సదరు డీసీపీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అయిదారు దశాబ్దాలుగా ఒకరి ఆధీనంలో ఉన్న నాలుగు ఎకరాలు స్థలాన్ని మరొకరికి కట్టబెట్టేందుకు ఆమె వకాల్తా పుచ్చుకున్నారు. బాధితులను భయపెట్టేలా ఐపీసీ 436 (తుపాకీతో బెదిరింపులు), 468 (ఫోర్జరీ) సెక్షన్లతో కేసులు నమోదు చేయించారు. తహసీల్దార్‌ ఆఫీస్​కు వెళ్లి రికార్డులు తీసుకున్నారు.

ఆ స్థలం బాధితుడిదేనని రెవెన్యూ అధికారులు నివేదిక ఇస్తే, వారిపై సైతం డీసీపీ మండిపడ్డారు. బాధితుడి స్థలం చుట్టూ ప్రహరీ, లోపల షెడ్లు, పశువులున్నా ఖాళీ చేయించేలా శతవిధాలుగా ప్రయత్నించారు. మరో కేసులో అదే ఠాణా పరిధిలో కొన్నేళ్లపాటు షెడ్లు వేసుకొని గణేశ్‌ విగ్రహాలు తయారు చేసుకుంటున్న బాధితులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు ఉన్నతాధికారులను కలసి ఫిర్యాదు చేయడంతో డీసీపీ వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్​ ఆమెను ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసింది.

పేకాట శిబిరం నిర్వహణ వెనుక ఎస్పీ : రాష్ట్రంలో జూదం నిర్వహణపై నిషేధం ఉండగా స్వయంగా ఓ ఎస్పీ తాను పనిచేస్తున్న జిల్లా కేంద్రంలోనే దొంగచాటుగా ఓ అపార్ట్​మెంట్​లో పేకాట శిబిరం సిద్ధం చేశారు. ఆ నిర్వహణ బాధ్యతను తన కుటుంబసభ్యుడికి అప్పగించారు. జూదరులకు కాయిన్లు సమకూర్చి ప్రతి ఆటకు రేటు కట్టి వసూలు చేశారు. ఈ విషయం నిఘా విభాగానికి తెలియడంతో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బృందాన్ని పంపి సోదాలు చేయించారు. ఎస్పీ కుటుంబసభ్యుడు వారిని అడ్డుకుని ఎస్పీకి చెప్పాలా ? అంటూ దబాయించారు. ఈ ఎస్పీ వ్యవహారశైలి గురించి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి స్వయంగా పత్రికా సమావేశంలో ఆక్షేపించడం గమనార్హం. ఎక్కడ పనిచేసినా ఆఫీస్​ మొహం చూడకుండా, ఇంటికే పరిమితమయ్యే ఆమెను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారు.

'ఛాతీపై పోలీస్ దాడి, లైంగిక వేధింపులు కూడా!'- ఆర్మీ ఆఫీసర్​ భార్య కేసులో సంచలన విషయాలు! - Odisha Army Officer Case

సైబర్​ నేరగాళ్ల దారిలోనే పోలీసులు - మళ్లీ నేరాలకు పాల్పడకుండా కేటుగాళ్లపై సాంకేతిక బ్రహ్మాస్త్రం - New Cyber Security Strategy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.