Financial Benefits With Labor Card : ఎండలో వానలో కాయకష్టం చేస్తూ చాలీచాలని కూలీ డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు ఓ వరం లాంటిది. పిల్లల చదవులు, పెళ్లిళ్లు, కాన్పులు, ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యపొందేందుకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కార్మికులందరికీ ప్రభుత్వం భరోసానిస్తుంది.
పెళ్లికి, కాన్పులకు ఆర్థికంగా : తెలంగాణ భవన నిర్మాణ బోర్డుతోపాటు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులలో పేర్లు నమోదుచేసుకుని కార్మికుడిగా గుర్తింపు కార్డు పొందాలి. రాష్ట్రంలో చాలామందికి లేబర్ కార్డు ద్వారా వచ్చే ప్రయోజనాలపై అవగాహన లేదు. కార్మిక కుటుంబాలకు గత అయిదేళ్లలో వివిధ పథకాల కింద రాష్ట్ర కార్మిక శాఖ రూ.కోట్లలో సహాయం అందజేసింది. కాన్పుల సహాయం కోసం దరఖాస్తు చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.30,038ల చొప్పున చెల్లిస్తుంది. పెళ్లి కానుక కింద ఒక్కొక్కరికి రూ.30,038 చొప్పున ఆర్థిక భరోసాను అందిస్తుంది.
లేబర్ కార్డును వినియోగించుకోవాలి : సహజ మరణం కింద మృతి చెందిన కార్మిక కుటుంబాలకు సంబంధించి రూ.1.30లక్షల చొప్పున పరిహారం అందుతుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణ పనులు చేస్తుండగా ఏదైనా ప్రమాదం సంభవించి మృతి చెందితే ఒక్కొక్కరికి రూ.6.30లక్షల చొప్పున సహాయం అందుతుందని, భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికులందరూ గుర్తింపు కార్డులు కలిగి ఉండి వాటిని కచ్చితంగా వినియోగించుకోవాలని కార్మిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
మే డే స్పెషల్ స్టోరీ : పని దొరికితే డబ్బులు - లేకపోతే ఆకలి కేకలు
HCUలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం - శిథిలాల కింద చిక్కుకున్న 9 మంది కార్మికులు