ETV Bharat / state

మద్దెలచెరువు సూరి హత్య కేసు - 12 ఏళ్ల తర్వాత బయటికొచ్చిన ప్రధాన నిందితుడు - BHANU KIRAN RELEASED FROM JAIL

మద్దెలచెరువు సూరి హత్య కేసు ప్రధాన నిందితుడు భాను కిరణ్ కు బెయిల్

bhanu_kiran_released_from_jail
bhanu_kiran_released_from_jail (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 7:04 PM IST

Maddela Cheruvu Suri Murder Case Accused Bhanu Kiran Released: హైదరాబాద్‌లో సంచలనం రేపిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితుడు భాను కిరణ్ బెయిల్​పై విడుదలయ్యారు. చంచల్‌గూడ జైలులో భాను కిరణ్ సుమారు 12 ఏళ్ల పాటు ఉన్నాడు. సీఐడీ అమ్స్ యాక్ట్​ కేసులో భాను కిరణ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.

2011 జనవరి 4వ తేదీన మద్దెల చెరువు సూరి భాను కిరణ్​ చేతిలో హత్యకు గురయ్యాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్​లోని సనత్ ​నగర్​లో భానుకిరణ్​ మద్దెల చెరువు సూరిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. అప్పట్లో ఈ మర్డర్​ కేసు పెద్ద సంచలనం సృష్టించింది. అనంతపురం ఫ్యాక్షన్​ రాజకీయాలలో పరిటాల రవి, మద్దెల చెరువు సూరి, మొద్దు శీను, భాను కిరణ్​ పేర్లు ఓ రక్త చరిత్రను తలపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

భాను కిరణ్​ జీవిత ఖైదుపై విచారణ: మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్​ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం విచారణ చేపట్టి భాను కిరణ్​కు శిక్షను విధించింది. తాను దాదాపుగా 12ఏళ్ల నుంచి శిక్షను అనుభవిస్తున్నానని, బెయిల్​ మంజూరు చేయాల్సిందిగా భాను కిరణ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం స్థానిక కోర్టులోనే ఈ కేసును పరిష్కరించుకోవాలని తెలిపింది. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. భాను కిరణ్​ జీవిత ఖైదుపై విచారణ నవంబరు 11వ తేదీన కోర్టు ముందుకు రానుంది.

కడప ఎస్పీ బదిలీ - మరో సీఐ సస్పెండ్ - 'వర్రా'పై కనికరం చూపినందుకు ఫలితం

"అతి మంచితనం చేతకానితనం కాకూడదు - అధికారుల హ్యాంగోవర్ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.