ETV Bharat / state

పరారీలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి - పోలీసుల లుకౌట్‌ నోటీసులు - LOOKOUT NOTICES FOR KAKANI

కాకాణి గోవర్దన్‌రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన పోలీసులు - ఇప్పటికే కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

lookout notices for kakani
lookout notices for kakani (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 10, 2025 at 11:36 AM IST

Updated : April 10, 2025 at 12:00 PM IST

2 Min Read

LOOKOUT NOTICES FOR KAKANI GOVARDHAN REDDY: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసుల విచారణకు కాకాణి హాజరు కాకపోవడం వల్ల పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అన్ని ఎయిర్‌పోర్టులు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

మరోవైపు పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా కాకాణి విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి గోవర్దన్‌రెడ్డి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్‌ నేతృత్వంలో 6 పోలీసు టీమ్​లు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

క్వార్ట్జ్‌ అక్రమ రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిపై ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. క్వార్ట్జ్‌ అక్రమ తరలింపు, అట్రాసిటీ, పోలీసులను దూషించిన కేసులను కాకాణిపై నమోదు చేశారు. తన అనుచరులతో కలిసి విదేశాలకు కలిసి రూ.250 కోట్లకుపైగా విలువ చేసే క్వార్ట్జ్‌ ఎగుమతి చేసినట్లు కాకాణిపై ఆరోపణలున్నాయి. అదే సమయంలో విదేశాల నుంచి పెద్దమొత్తాల్లో నగదు బదిలీపై పూర్తిస్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కంపెనీలు, వాటిని కొన్న వ్యక్తులు, వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి: కాగా క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై నెల్లూరు జిల్లాలోని పొదలకూరు పోలీసు స్టేషన్‌లో ఫిబ్రవరిలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. అయితే విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినా, ఆయన హాజరు కాలేదు. అంతే కాకుండా అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు జారీ చేసి, ఆయన కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇతర ప్రాంతాలలో తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా కాకాణి దేశం విడిచివెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

కాకాణి గోవర్ధన్​రెడ్డికి షాక్​ - ఆ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

పట్టుకోండి చూద్దాం! - పోలీసులకు సవాల్ విసురుతున్న కాకాణి

Last Updated : April 10, 2025 at 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.