Leopard Roaming in Ananthapur District: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి గ్రామ సమీపంలోని తూరత్ కొండపై చిరుత సంచారంతో గ్రామ రైతులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం ఉదయం పీసీ ప్యాపిలి గ్రామ రైతుకు చెందిన 6 గొర్రెలు, మేకలను చిరుత పులి ఎత్తుకెళ్లిందని గ్రామస్థులు వాపోయారు.
రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే సమయంలో కొండపై చిరుతను చూశారు. పొలాల్లోకి వెళ్లాలంటనే భయపడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. చిరుత సంచారం తమకుకంటిమీద కొనుక్కు లేకుండా చేస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు స్పందించి చిరుత పులిని అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.
''మాది వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి గ్రామం. ఇక్కడ చిరుత సంచరించడం వలన పొలాలకు వెళ్లే రైతులంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో గొర్రెలు, మేకలను చిరుత పులి లాక్కెళ్లి తినేసింది. దీనిపై అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం''-సుధాకర్, పీసీ ప్యాపిలి గ్రామస్థుడు
చిక్కదు, దొరకదు - రూటు మార్చి చుక్కలు చూపిస్తున్న చిరుత - Leopard Active in Kadiyam Nurseries