Lawyer Venugopal Dies Of Heart Attack In Telangana High Court :హైకోర్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. కోర్టు హాలులో న్యాయవాది వేణుగోపాలరావు కుప్పకూలిన ఘటన తోటి న్యాయవాదులను కలచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే
రెగ్యులర్ పిటిషన్లను వాయిదా : లాయర్ వేణుగోపాలరావు 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఆయన కూప్పకూలారు. ఇది గమనించిన తోటి లాయర్లు వెంటనే వేణుగోపాలరావును అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వేణుగోపాలరావు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. లాయర్ మృతికి సంతాప సూచకంగా 21వ కోర్టులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. మిగతా కోర్టుల్లోనూ అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు.
గుండెపోటుతో 8వ తరగతి విద్యార్థి మృతి - కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు