Kokapet connectivity to the Outer Ring Road : హెచ్‌ఎండీఏ దాదాపు 530 ఎకరాల్లో తీర్చిదిద్దిన కోకాపేట్ నియోపొలిస్ లేఅవుట్‌తో ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానం ఏర్పడింది. రూ.65 కోట్లతో నిర్మించిన ట్రంపెట్ జంక్షన్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెలలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అనేక ఐటీ, సాఫ్ట్వేర్ : ఈ జంక్షన్ అభివృద్ధితో కేవలం నియోపొలిస్ లేఅవుట్ మాత్రమే కాకుండా మోకిల, శంకర్‌పల్లి తదితర చుట్టు పక్కల నుంచి నేరుగా ఓఆర్‌ఆర్‌తో కనెక్టివిటీ ఏర్పడింది. చుట్టూ తిరిగి ఓఆర్ఆర్పైకి చేరుకునే ఇబ్బంది తప్పింది. ఈ ప్రాంతంలో అనేక ఐటీ, సాఫ్ట్వేర్ ఇతర కంపెనీలు ఉన్నాయి. నియోపొలిస్ నుంచి కేవలం 20 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే వీలు ఏర్పడింది.
విడతల వారీగా వేలం : నాలుగు వరుసలతో ప్రధాన ట్రంపెట్ నిర్మాణం పొడవు 600 మీటర్లు కాగా ఔటర్‌తో కలిసి సర్వీసు రోడ్లను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 1.3 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో భూములను విడతల వారీగా వేలం ద్వారా ప్రభుత్వం విక్రయించింది.
ఇక్కడ భూములు కొన్న పలు కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మాణాలను ఇప్పటికే వేగంగా చేపడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ చాలా భవనాలు రూపుదిద్దుకొన్నాయి. తాజాగా ఓ ప్రముఖ సంస్థ 63 అంతస్తుల ఆకాశహర్మ్యం చేపట్టనున్నట్లు ప్రకటించింది. బహళ వినియోగ జోన్‌లో ఈ లేఅవుట్ ఉండటంతో నివాస, వ్యాపార, వాణిజ్య అవసరాలకు భారీ భవనాలు నిర్మిస్తున్నారు. మౌలిక వసతులకు హెచ్‌ఎండీఏ దాదాపు రూ.450 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు.
హెచ్‌ఎండీఏ వద్ద మరో 5 ప్లాట్లు : హెచ్‌ఎండీఏ మొత్తం భూమిలో వేలం ద్వారా ప్లాట్లను విక్రయించగా, ఇంకా భారీ సైజులో మరో 5 ప్లాట్లు ప్రభుత్వ ఖాతాలో ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ ఎకరా రూ.100 కోట్లు పలకడంతో ఈ ప్లాట్లకు భారీ డిమాండ్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వీటిని అమ్మివేయాలా? భవిష్యత్తు అవసరాలకు ప్రభుత్వ ఖాతాలో ఉంచాలా? అనే అంశంపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పుడే వేలం వేద్దామా? - ఇంకొంతకాలం వేచి చూద్దామా? - అయోమయంలో హెచ్‌ఎండీఏ!
Kokapet Land Auction : కోట్లు కురిపించిన కోకాపేట నియోపోలీస్ భూముల వేలం.. ఎకరానికి ఎంతంటే ?