College Students Educating Public On Traffic Rules in Vijayawada : సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిలో యువతే అధికంగా ఉంటారు. సామాన్య ప్రజలు సైతం వీళ్లు చేసే విన్యాసాలతో సతమతం అవుతుంటారు. అలాంటిది వాళ్లే ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తే, రూల్స్ పాటించని వారంటూ ఉండరు కదా! సరిగ్గా అలాంటిదే విజయవాడ రద్దీ ప్రాంతాల్లో జరుగుతోంది. కేబీఎన్(KBN) కాలేజీకి చెందిన విద్యార్థులు వాహన చోధకులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. NSSలో భాగంగా ట్రాఫిక్ పోలీసులతో కలిసి విజయవాడ కూడల్లో విధులు నిర్వహిస్తున్నారు.
వాహనదారులకు ట్రాఫిక్ పాఠాలు : పగలు కళాశాలల్లో పాఠాలు నేర్చుకుని సాయంత్రం సమయంలో రోడ్లపై వాహనదారులకు ట్రాఫిక్ పాఠాలు చెబుతున్నారు. సమాజంలో తమ వంతు బాధ్యతగా కళాశాల విద్యార్దులు ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ల వినియోగం, సీట్ బెల్ట్ వల్ల కలిగే ఉపయోగాలను వాహనదారులకు వివరిస్తున్నారు. విజయవాడలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో విద్యార్ధులు కలిసి ట్రాఫిక్ వాలంటీర్లుగా నిత్యం సేవలు అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బెజవాడ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు వేయటమే కాదు వారికి నిబంధనలను వివరించే కార్యక్రమాలు చేపడుతున్నారు.
"కేబీఎన్ కాలేజీ తరఫున NSS విభాగం నుంచి వచ్చాం. మేము హెల్మెట్ లేని వాళ్లు, ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్లు, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారు, ఆటోల్లో యూనిఫాం లేనివాళ్లకి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తున్నాం. చదువుకుంటూనే సమాజసేవ చేయటం ఆనందంగా ఉంది. దీనివల్ల ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలో అర్థం అవుతోంది. NSS తరఫున మాకు సర్టిఫికెట్ ఇస్తారు. ఇది మాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది." - కేబీఎన్ విద్యార్థులు
అనారోగ్యం నుంచి రైతులకు రక్షణ - అందరి మన్ననలు పొందుతున్న శ్రీయ
పుట్టుకతోనే మూగ, చెవుడు - ఆత్మవిశ్వాసంతో క్రికెట్లో సత్తా చాటుతున్న యశ్వంత్