ETV Bharat / state

మరింత పుణ్యం కోసం కార్తిక పౌర్ణమి - పద్మపురాణం, భక్తేశ్వర వ్రతకల్పం బోధించేది ఇదే! - KARTHIKA POURNAMI 2024

పద్మ పురాణం, భక్తేశ్వర వ్రత కల్పంలో కార్తిక పూర్ణిమ ప్రస్తావన - నిష్కల్మష భక్తితో ఏదైనా సాధించవచ్చన్న సత్యబోధన

Karthika Masam Special 2024
Karthika Pournami 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2024, 5:08 PM IST

Karthika Pournami 2024 : కార్తిక పౌర్ణమి పర్వదినం ఏనాటి నుంచో భారతావనిలో జరుగుతూ వస్తోంది. పద్మపురాణంలో ఈ పండుగను శౌనకాది మహర్షులు జరుపుకొన్న విధానాన్నే కార్తిక పురాణ పారాయణలో పదిహేనో రోజు పారాయణాంశంగా చెబుతారు. నైమిశారణ్యంలో సూత మహర్షి ఆధ్వర్యంలో మునులంతా శ్రీమహావిష్ణువు ప్రతిమను ఒక ఉసిరి చెట్టు కింద ఏర్పాటు చేశారు. అనంతరం వనభోజన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత తులసి పూజ నిర్వహించి సాయంత్రానికి మళ్లీ కార్తిక దామోదరుడిగా శ్రీహరిని భావించుకొని ఆయనకు నమస్కరించి దీపారాధన చేసి షోడశోపచారాలతో అర్చించారు. ఆ తర్వాత ఓ చక్కటి చెట్టు మానుతో చేసిన స్తంభాన్ని తెచ్చి దాని మీద బియ్యం, నువ్వులు లాంటి ధాన్యాలను, దాని మీద ఆవు నేతిలో దివ్యజ్యోతిని వెలిగించి శ్రీమహావిష్ణువును అర్చించారు. అనంతరం కార్తిక పురాణాన్ని మొదటి రోజు నుంచి పదిహేనో రోజు వరకు ఉన్న అంశాలను, కథలను అన్నిటినీ పఠించారు. ఆనాటి రాత్రి హరినామ స్మరణంతోనూ, సంకీర్తనలు, నాట్యాలతోనూ భక్తి పారవశ్యంతో కాలం గడిపారు. ఈ కథా భాగాన్ని కార్తిక పురాణ పారాయణలో 15వ రోజు చేస్తుంటారు.

భక్తేశ్వర వ్రతకల్పం ప్రాముఖ్యత : కార్తిక పూర్ణిమనాడు మహాశివుడు గురించి చేసే ఓ వ్రతం ప్రచారంలో ఉంది. దీనినే భక్తేశ్వర వ్రతకల్పంగా పిలుస్తారు. ఈ వ్రతాచరణలో అంతర్లీనంగా దాగివున్న ఓ కథను పురాణాలు ఇలా పేర్కొంటున్నాయి. పూర్వం మథుర సామ్రాజ్యాన్ని చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి కుముద్వతి అనే అనుకూలవతి అయిన సతీమణి ఉండేది. ఆ రాజుకు చాలా కాలం వరకూ పిల్లలు కలగలేదు. సంతానం కోసమని ఆ పార్వతీపతి గురించి ఆ దంపతులిద్దరూ చాలా కాలం పాటు తపస్సు చేశారు. తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై వారి కోరిక విని అల్పాయుష్కుడైన కుమారుడు కావాలా? ఆయుష్షుండీ విధవరాలుగా ఉండబోయే కుమార్తె కావాలా? అని అడిగాడు. వారు కుమారుడే కావాలని కోరారు. వారిని అనుగ్రహించి శివుడు అంతర్థానమయ్యాడు. రాణి కొంత కాలానికి గర్భవతియై పండంటి కుమారుడిని ప్రసవించింది.

ఆ పిల్లవాడు అల్లారుముద్దుగా బాగా పెరిగి పెద్దవాడయ్యాడు. అదే రోజుల్లో సమీప రాజ్యమైన అలకాపురినేలుతున్న మహారాజు మిత్రసహుడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె చిన్న వయస్సు నుంచి ఆ మహాశివుడుని గొప్పగా ఆరాధిస్తూ ఉండేది. భక్తేశ్వరలింగాన్ని ఆమె ప్రతిక్షణం పూజిస్తూ ఉండేది. ఇదే క్రమంలో మథుర రాజుకు మిత్రసహుడి కుమార్తె గురించి తెలిసింది. తన కుమారుడికి మరణకాలం ప్రాప్తిస్తుందని ఆ రాజు గ్రహించి ఆ ఆపద నుంచి తన కుమారుడిని ఎలానైనా గట్టెక్కించుకోవటానికి మిత్రసహుడి కుమార్తెనిచ్చి వివాహం చేయటం మేలనుకున్నాడు. అప్పుడు ఆమె తన భక్తితోనూ, పాతివ్రత్యంతోనూ తన కుమారుడిని రక్షించుకోగలనన్నది మథుర రాజు చంద్రపాడ్యుడి ఆలోచన.

పౌర్ణమినాడు సముద్ర స్నానం చేస్తే : అలా చంద్రపాడ్యుడు ఎలాగో ఒక లాగా మిత్రసహుడిని ఒప్పించి ఆయన కుమార్తెను తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహమైన కొద్ది రోజులకే చంద్రపాండ్యుడి కుమారుడి ఆయుష్షు తీరిపోవటంతో యముడు బయలుదేరి వచ్చాడు. ఆ విషయాన్ని గమనించిన మిత్రసహుడి కుమార్తె వెంటనే తన దైవమైన శివుడును స్మరించింది. భక్తేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై యమధర్మరాజుతో పోరి జయించి, చంద్రపాండ్య రాజు కుమారుడి ప్రాణాలను రక్షించి, పూర్ణాయువు ప్రసాదించి అంతర్థానమయ్యాడు. ఇది భక్తేశ్వర వ్రతకల్పం. నిష్కల్మష భక్తితో ఏదైనా సాధించవచ్చన్న ఓ సత్యాన్ని ఈ వ్రత కథ వివరిస్తోంది. కార్తిక పౌర్ణమినే మహాకార్తిక అని కూడా అంటారు. రేపటి రోజు (నవంబర్ 15) పుణ్యనదులు, సముద్రాల్లో స్నానం చేస్తే మామూలుగా లభించే పుణ్యం కన్నా అధిక పుణ్యం లభిస్తుందన్నది నమ్మకం. మహాఫల, నానాఫల, సౌభాగ్య, మనోరథ పూర్ణిమ, కృత్రిక, గోప్రధాన తదితర వ్రతాలను, వ్రత ఉద్యాపనలను ఈనాడు ఆచరిస్తుంటారు. లక్ష తులసీపూజ, లక్ష దీపార్చన, జ్వాలా తోరణం లాంటి పూజలు, ఉత్సవాలు భారతావని అంతటా జరుగుతాయి.

కార్తిక పౌర్ణమి రోజు ఈ దీపం వెలిగిస్తున్నారా? - ఏడాది పుణ్యం మీ సొంతం!

"15న కార్తిక పౌర్ణమి పర్వదినం - ఆ రోజున తప్పక చేయాల్సిన పూజలు ఇవే!"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.