Interstate Robbery Gang Arrest : దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇంటర్ స్టేట్ దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో కామారెడ్డి ఎస్పీ రాజేష్‌చంద్ర వివరాలను వెల్లడించారు. కొన్ని నెలలుగా 44వ నేషనల్ హైవేపై వివిధ రకాలైన దారి దోపిడీలు జరుగుతున్నాయి. ఇటీవల దేవునిపల్లి, సదాశివనగర్ ఠాణాల పరిధిలో కేసులు నమోదయ్యాయి.
తీవ్రంగా పరిగణించిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలించారు. వీరికి లభించిన ఎవిడెన్స్‌తో దొంగల ముఠాలోని 7 పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, నాలుగు కత్తులు, 2 కర్రలు, రాళ్లు వంటి మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రహదారి పక్కనే మకాం : ముఠా సభ్యులు రహదారి పక్కన గుడారాలు వేసుకొని పొద్దంతా బెలూన్లు, ఇతర పరికాల అమ్మకాలతో చిరువ్యాపారాలను చేస్తున్నట్లుగా నటిస్తారు. రాత్రి కాగానే నేషనల్ హైవే పక్కన ఆగి ఉన్న వాహనదారులను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతుంటారు. నిలిపి ఉంచిన వెహికిల్స్ అద్దాలు పగులగొట్టి వాహనదారులపై దాడికి పాల్పడుతారు. వారిని కత్తులతో బెదిరించి డబ్బులు, విలువైన వస్తువులు, స్మార్ట్ఫోన్లను దొంగిలిస్తుంటారు.
ఏడుగురి రిమాండ్ పరారీలో నలుగురు : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, డిచ్‌పల్లి, కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లి, సదాశివనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఠా సభ్యులు దోపిడీలకు పాల్పడ్డారు. కాగా వీరంతా మహారాష్ట్ర వాసులే. కిసాన్ పవార్, జాకీ గుజ్జు బోస్లే, చుడి అనే మహిళతో పాటు దంపతులు పవార్ హరీశ్- హౌరా పవార్, అనురాగ్ రత్నప్ప బోస్లే- అంచనలను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
పరారీలో నలుగురు : మరో 4 (చిరంజీవి, గుండా, సంబా బోస్లే, బంగారు బోస్లే) పరారీలో ఉన్నారు. దోపిడీ దొంగల ముఠాను పట్టుకున్న కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డితో పాటు, సీసీఎస్, కామారెడ్డి గ్రామీణం, సదాశివనగర్ సీఐలు శ్రీనివాస్, రామన్, సంతోష్‌కుమార్, దేవునిపల్లి ఎస్సై రాజు, సదాశివనగర్ ఎస్సై రంజిత్, ఐటీ కోర్ శ్రీనివాస్, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రశంసించారు.
కొత్తవారు మీతో ఆ విషయాలు మాట్లాడుతున్నారా? - అయితే జాగ్రత్త పడాల్సిందే!
అద్దెకు దిగుతామంటూ సొమ్ముపై కన్నేసి - ఆపై వృద్ధ దంపతులను హత్యచేసి!