Kakinada Student Nehanjani Scores 600 Marks in AP SSC Results : ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే బాలికకు 600/600 మార్కులు వచ్చాయి. నగరంలోని భాష్యం పాఠశాలలో బాలిక చదువుతోంది. మరోవైపు ఎలమంచిలి చైతన్య స్కూల్‌లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది.
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 4,98,585 మంది పాసైనట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో 93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. బాలికల్లో 84.09 శాతం, బాలురలో 78.31 శాతం పాసయ్యారు. 1,680 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. మే 19 నుంచి 28 వరకు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు నిర్వహించనున్నారు.
క్యాన్సర్తో పోరాడుతూనే ఇంటర్లో 420 మార్కులు - డాక్టర్ అవుతానంటున్న సృజనామృత