Kakani Govardhan Reddy Police Custody Updates : అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో కోర్టు పత్రాలు తీసుకొని జైలుకు వచ్చిన అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొని కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు మధ్య కాకాణిని తరలించారు. న్యాయవాది సమక్షంలో మూడు రోజుల పాటు విచారించి అనంతరం మళ్లీ కోర్టులో హజరుపరచనున్నారు. కాకాణిపై అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులు ఉన్నాయి.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం తదితర అభియోగాలపై శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో కాకాణి నాలుగో నిందితుడి (ఏ4)గా ఉన్నారు.
కాకాణి గోవర్ధన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ - విచారణ ఈనెల 5కు వాయిదా
అక్రమ మైనింగ్ కేసు - కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్