Police Case on MPP Amarnath Reddy : శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్సార్సీపీ ఎంపీపీ అమర్నాథ్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఓ బాకీ వసూలు విషయంలో ఆయన అనంతపురానికి చెందిన విశ్వనాథరెడ్డి, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారు. విశ్వనాథరెడ్డి తన వ్యక్తిగత అవసరాల కోసం ఎంపీపీ వద్ద అప్పు తీసుకున్నారు. అసలు ఇప్పటికే చెల్లించి వడ్డీకి చెక్కులు ఇచ్చారు. చెక్కులు అక్కర్లేదంటూ వారిపై అమర్నాథ్ రెడ్డి బూతులతో విరుచుకుపడ్డారు. అంతేకాక మీ అంతుచూస్తానని బెదిరించినట్లు బాధితుడు విశ్వనాథరెడ్డి కదిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీపీపై పోలీసులు కేసు పెట్టారు.
మరోవైపు కదిరికి చెందిన వైఎస్సార్సీపీ నేత షామీర్ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రెండు పార్టీల మధ్య ఘర్షణలు ప్రేరేపించేలా అతను మాట్లాడారని టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు షామీర్పై కేసు నమోదు చేసినట్లు కదిరి అర్బన్ ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు.
'డబ్బులివ్వకుంటే నీ అంతు చూస్తా' - వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బెదిరింపులు
పోలీసు విధులకు ఆటంకం - అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు