Jubilee Hills MLA Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(62) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. గుండె సంబంధిత సమస్యతో మధ్యాహ్నం మాగంటి గోపీనాథ్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. ఆయనను వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, ఇతర నాయకులు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు.
మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని, ఆయన క్షేమంగా రావాలని హరీశ్ రావు ఆకాంక్షించారు. మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ సభ్యునిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున, 2018, 2023లో బీఆర్ఎస్ తరపున గెలుపొందారు.
వైద్యానికి స్పందిస్తున్నారు : మాగంటి గోపీనాథ్ క్రమంగా కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. ఎవరూ మానసిక ఆందోళన గురికావద్దని, మీడియా తప్పుడు సమాజాన్ని అందించవద్దని కోరారు. ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని, వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల మాగంటి గోపీనాథ్ కొంత ఒత్తిడి కి గురయ్యారనని, సర్దార్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఆయన ఒత్తిడికి గురయ్యారని అన్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నామని, అందరూ పూజలు చేయాలని కోరారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో మాగంటి ఉంటారని తెలిపారు.