ETV Bharat / state

రూ.5.5 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు - బహిరంగ మార్కెట్​లో విలువ రూ.100 కోట్ల పైనే! - EE SRIDHAR ASSETS CASE

ఐదు రోజుల కస్టడీలో భాగంగా నీటి పారుదల శాఖ ఈఈని విచారించిన ఏసీబీ - ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ - విలాసవంతమైన విల్లా సహా భవనాలు, ఓపెన్‌ ప్లాట్లు, వ్యవసాయ భూములు

EE Sridhar Disproportionate Assets Case
EE Sridhar Disproportionate Assets Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 21, 2025 at 8:05 PM IST

3 Min Read

EE Sridhar Disproportionate Assets Case : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటి పారుదల శాఖ ఈఈ శ్రీధర్‌ భారీగా స్థిర, చరాస్తులను సంపాదించినట్లు గుర్తించారు. ఐదు రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. విలాసవంతమైన విల్లా, ప్లాట్లు, భూములు సహా బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈఈ నూనె శ్రీధర్‌ ఓ ఉన్నతాధికారికి బినామీ అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. ఐతే, విచారణలో నిందితుడు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

ఉద్యోగ జీవితంలో పెద్ద ఎత్తున అక్రమ సంపాదన - బహిరంగ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైనే (ETV)

పెద్ద ఎత్తున అక్రమ సంపాదన : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఈఈ నూనే శ్రీధర్‌, తొలి రోజు విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఏసీబీ కోర్టు అనుమతితో ఐదురోజుల కస్టడీకి తీసుకున్న అధికారులు, అక్రమ సంపాదనపై వివరాలు రాబట్టారు. వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన నూనె శ్రీధర్, 1992లో ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అనతి కాలంలోనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా, ఆపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పదోన్నతులు పొందాడు. ఏసీబీకి చిక్కిన సమయంలో కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ క్యాంపు డివిజన్ నెంబర్‌-8కి ఈఈగా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీధర్‌ ఉద్యోగ జీవితంలో పెద్ద ఎత్తున అక్రమంగా డబ్బు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. అక్రమార్జనతో కొనుగోలు చేసిన ఆస్తుల విలువ దాదాపు ఏడున్నర కోట్ల పైనే ఉంటుందని అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

పెద్ద మొత్తంలో డిపాజిట్లు : ఈఈ శ్రీధర్‌కు సంబంధించిన స్థిర చరాస్తులను ఏసీబీ గుర్తించింది. ఇప్పటివరకూ రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో ఓ విలాసవంతమైన విల్లా, కరీంనగర్‌లో 3 ఫ్లాట్లు, షేక్‌పేటలో ఒక ఫ్లాట్, అమీర్‌పేటలో ఒక వాణిజ్య భవనం సహా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో పలు భవనాలు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా, 16 ఎకరాల వ్యవసాయ భూమి, పలు ప్రాంతాల్లో 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా తేల్చారు. 2 బైక్‌లతో పాటు విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ, వివిధ బ్యాంకులలో పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించింది. ఈ ఆస్తులన్నీ శ్రీధర్‌తో పాటు అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

రూ.100 కోట్లకు పైనే : నూనె శ్రీధర్‌, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతనికి వేతనం సహా ఇతర మార్గాల ద్వారా సుమారు 4.5 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఏసీబీ అధికారులు లెక్కించారు. అదే సమయంలో, అతనితో పాటు కుటుంబ సభ్యుల వ్యయం దాదాపు రూ.1.88 కోట్లుగా నిర్ధారించారు. ఈ లెక్కన, శ్రీధర్‌కు రూ.2.61 కోట్లు మాత్రమే పొదుపు ఉండాలి. ఐతే, ఇందుకు భిన్నంగా రూ.5.5 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు అదనంగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవన్నీ అతని ఆదాయానికి మించిన ఆస్తులుగా ప్రాథమికంగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉన్నతాధికారులకు బినామీ? : నీటిపారుదల శాఖలో కొందరు ఉన్నతాధికారులకు శ్రీధర్ బినామీగా ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలోనూ ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న పత్రాల్లోని సమాచారం ఆధారంగా శ్రీధర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్. దాదాపు ఏడాది క్రితమే చొప్పదండి నుంచి బదిలీ ఉత్తర్వులు వచ్చినా, ఓ ఉన్నతాధికారి అండతో అక్కడే కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపైనా ఏసీబీ శ్రీధర్‌ను ప్రశ్నించగా, పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయమై సదరు ఉన్నతాధికారికి సైతం ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన నాలుగు రోజుల విచారణలో శ్రీధర్ నుంచి మరింత కీలక సమాచారం వెలుగులోకి వస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

అక్రమంగా రూ.కోట్ల సంపాదన! - తనిఖీల్లో కళ్లు చెదిరే సొమ్ము

ఇరిగేషన్ ఎస్ఈ నూనె శ్రీధర్‌పై ఇంటిపై ఏసీబీ దాడులు - వందల కోట్ల అక్రమాస్తుల సీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.