ETV Bharat / state

IRCTC భారత్ గౌరవ్ యాత్ర - తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు - IRCTC BHARAT GAURAV TOURIST TRAINS

దేశంలోని పుణ్యక్షేత్రాల కోసం రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు - భారత్ గౌరవ్ యాత్ర పేరిట వివిధ ప్రాంతాలకు రైళ్లు

IRCTC Bharat Gaurav Tourist Trains
IRCTC Bharat Gaurav Tourist Trains (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 12, 2025 at 2:55 PM IST

3 Min Read

IRCTC Bharat Gaurav Tourist Trains: సుదూర ప్రాంతాల్లోని ప్రఖ్యాత తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా? దేశంలో పుణ్యక్షేత్రాలు, అక్కడ వెలిసిన దేవుళ్లను దర్శించుకోవాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. భారత్ గౌరవ్ యాత్ర పేరిట తక్కువ ఖర్చుతో, సకల సదుపాయాలతో దర్శించుకునేలా అద్భుతమైన ప్యాకేజీలు అందుబాటులో ఉంచారు. వేసవిరాకతో రైళ్లలో క్షేత్రాల సందర్శనకు భక్తులు, పర్యాటకులు పోటీ పడుతున్నారు. భారత్ గౌరవ్‌ రైళ్లు ఎక్కడెక్కడికి నడుస్తున్నాయి. వాటిలో సదుపాయాలేంటనే అంశాలపై ప్రత్యేక కథనం.

అనేక ప్రసిద్ద ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు నిలయం మన భారతదేశం. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే అనేక దేవాలయాలు, వారసత్వ, ప్రాచీణ కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. భారతదేశ సాంస్కృతిక, వారసత్వ స్థలాలు, ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్ర స్థలాలను ప్రజలకు తిలకించే అవకాశం కల్పించడం సహా ప్రపంచానికి తెలియచేయాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టినవే భారత గౌరవ్ టూరిజం రైళ్లు. రైల్వేశాఖ సహకారంతో IRCTC దేశవ్యాప్తంగా నడుపుతోన్న సర్వీసులకు యాత్రికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలుపుతూ పలు ప్రాంతాల నుంచి భారత్ గౌరవ్ యాత్ర రైళ్లు నడుపుతున్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. వైష్ణవ, కేశవ ఆలయాలు, అమ్మవారు కొలువైన ప్రసిద్ద క్షేత్రాలను కలుపుతూ రైళ్లు నడుస్తున్నాయి. ద్వారకా, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, సోమనాథ్, త్రయంబకేశ్వర్, నాసిక్, భద్రాచలం, తిరుపతి క్షేత్రాలకు రైళ్లు నడుస్తున్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా పేరొందిన పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కిస్తున్నారు. వేసవిలో తీర్థయాత్రలకు వెళ్లేవారు రైళ్లలో బెర్తులను ముందుగానే బుకింగ్ చేసుకుని కుటుంబాలతో సహా సందర్శించుకుంటున్నారు.

భారత్ గౌరవ్‌ టూరిజం రైళ్లు ప్రత్యేకంగా రూపొందించారు. బోగీలపైన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పలు రాష్ట్రాల్లోని భిన్న సంస్కృతలు, వస్త్రధారణ, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలు సహా మహనీయుల ఫొటోలతో పేయింటింగ్ వేసి, ఆకర్షణీయంగా తయారు చేశారు. ఏసీ, నాన్ ఏసీ విభాగంలో స్లీపర్ క్లాస్ బోగీలు ఏర్పాటు చేశారు. రైలు ఎక్కిన నాటి నుంచి యాత్ర పూర్తయ్యేవరకు అతిథుల్లా సకల మర్యాదలు చేస్తున్నారు. రైలు ఎక్కేందుకు వచ్చిన వారికి మంగళ వాయిద్యాలతో ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. వేడి వేడి వంటకాలను రుచికరంగా తయారు చేసేందుకు రైలులోనే పాంట్రీని ఏర్పాటు చేశారు.

బోగీల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యులు అందుబాటులో ఉంచుతారు. యాత్రికులకు బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నారు. సందర్శన క్షేత్రాలు చేరుకోగానే రైలు ఆగిన చోటు నుంచి ప్రత్యేక బస్సుల్లో వసతి కేంద్రాల వరకు తీసుకువెళ్తారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ సహా పలుప్రాంతాల నుంచి యాత్రికులు కుటుంబాలతో తీర్థయాత్రల సందర్శనకు వెళ్తేందుకు ఆసక్తి చూపుతున్నారు. రైళ్లు ప్రకటించగానే పెద్దఎత్తున టికెట్లు బుకింగ్ అవుతున్నాయని రైల్వేశాఖ చెబుతోంది. దీంతో IRCTC లాభదాయకంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. యాత్రలకు వెళ్లాలనుకునేవారు వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా టికెట్లు పొందవచ్చని తెలిపారు.

"రైల్వే వాళ్లు భారత్ గౌరవ్ యాత్ర పెట్టడం వలన హిందువులు అందరికీ మంచి అవకాశం. అందరూ దీనిని మంచిగా ఉపయోగించుకోవచ్చు. నేను ఈ యాత్రకి వెళ్లడం మూడోసారి. మొదటి రెండు సార్లు చాలా మంచిగా ప్రయాణం జరిగింది. ఏర్పాట్లు అన్నీ చాలా చక్కగా చేశారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది". - యాత్రికుడు

"ఈ వేసవి చల్లచల్లగా గడిచేలా IRCTC టూర్ ప్లాన్" - విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లు

కేదార్​నాథ్​కు హెలికాప్టర్​ బుకింగ్స్ ప్రారంభం - రూ.6వేలకే వెళ్లిరావొచ్చు!

"వేసవిలో చల్లచల్లగా" - కేరళ, ఊటీ, అరకు - IRCTC ఐదు టూర్ ప్యాకేజీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.