ETV Bharat / state

సెలవులను ఇలా ఉపయోగించుకుంటే - మీ భవిష్యత్తు బంగారమే! - LEARN SKILLS DURING SUMMER

ఇంటర్​ పరీక్షలు అయిపోయాయని ఫోన్లు, టీవీ చూస్తున్నారా? - వేసవి సెలవుల్లో ఇలాంటి కోర్సు నేర్చుకుంటే బంగారు భవిష్యత్తు మీ సొంతం!

Things to do during Vacations for Inter Students
Things to do during Vacations for Inter Students (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 18, 2025 at 12:33 PM IST

2 Min Read

Things to do during Vacations for Inter Students : సాధన చేస్తే ఏదైనా సులభమేనని పెద్దలు చెబుతుంటారు. ఇంటర్మీడియట్​ పరీక్షలు రాయడం పూర్తయిన విద్యార్థులు సెలవులను సద్వినియోగం చేసుకోగలిగితే రేపు భవిష్యత్తు చక్కగా ఉండటమే కాకుండా రానున్న తరాలకు బంగారు బాటలు వేసిన వాళ్లు అవుతారు. ఈ సెలవుల్లో ప్రతిభా నైపుణ్యాలకు పదును పెట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలుగుతాం. బహుళ నైపుణ్యాలు ఎప్పుడైనా పని కొస్తాయి. సెలవులను సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ నెల 21న ఇంటర్​ ఫలితాలు విడుదల కానున్నాయి. మరి విద్యార్థులు సెలవుల్లో మెదడుకు పని చెప్పి నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే.

పరీక్షలు అయిపోయాయి. ఇక పనేమీ లేదని సెల్​ఫోన్, టీవీలతో సరదాగా కుస్తీ పడితే మాత్రం భవిష్యత్తు నాశనం అవుతుంది. దీనికి మన చేతులా మనమే భవిష్యత్తును నాశనం చేసుకున్న వాళ్లం అవుతాం. నిత్యం సెల్​ఫోన్​తో కాలక్షేపం చేస్తే శారీరక, మానసిక, ఆరోగ్య సమస్యలు ఎన్నో తలెత్తుతాయి. కొత్త విద్యా సంవత్సరంలో ఏ కోర్సులో చేరితే భవిష్యత్తు బాగుంటుందో అంతర్జాలంతో సైతం పరిశీలించవచ్చు. మీరు వేసుకునే ప్రణాళికతో విద్యా సంబంధ విషయాలు, ఉచిత పుస్తకాలు అందుబాటులో ఉన్న పాఠాలను వినియోగించుకోవాలి.

సెలవుల్లో కాస్త కష్టపడితే ఇంజినీరింగ్​, మెడిసిన్​ సీటు : ఇంటర్​ విద్యార్థులు సమయం విలువను గుర్తిస్తే ఇంజినీరింగ్​, మెడిసిన్​ దేనిలోనైనా సరే సీటును తెచ్చుకునేందుకు అవకాశం ఉంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు ఆ దిశగా కసరత్తు ప్రారంభిస్తే ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదివి ర్యాంకుతో పాటు సీటును సొంతం చేసుకోవచ్చు. ఈ క్రమంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. సెలవు రోజుల్లో ప్రధాన పట్టణాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. వాటికి మీరు వెళితే మంచిగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు.

అలాగే అకడమిక్​ చదువులే కాకుండా వేసవిలో ప్రత్యేకంగా నిర్వహించే నృత్యం, కంప్యూటర్​, గేమ్స్​, సంగీతం, చిత్రలేఖనం లాంటివి కూడా నేర్చుకుంటే అదనపు నైపుణ్యం మనకు చేరువైనట్లే అని తెలుసుకోవాలి. అంతేకాదు మనకు ఇష్టమైన వ్యాపకాలు, అభిరుచులకు పదును పెట్టుకునే సమయం కూడా ఇదే అని గుర్తించాలి. సెలవులు ముగిసేలోగా పట్టు సాధిస్తే భవిష్యత్తులో ఉపాధికి ఢోకా ఉండదు. అందుకే వేసవి సెలవులను వృథా చేసుకోకుండా చక్కగా నైపుణ్యాలకు పదును పెట్టుకుంటే భవిష్యత్తు బంగారుమయమే!

ఎగ్జామ్స్​ అయిపోయాయని ఖాళీగా ఉంటున్నారా? - హాలిడేస్​ను ఇలా ఉపయోగించుకోండి

ఎగ్జామ్​ టిప్స్ : చదివిందే మళ్లీ చదవండి - కొత్త వాటి జోలికి అస్సలు వెళ్లకండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.