ETV Bharat / state

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ వచ్చేసింది - పరీక్షలు ఎప్పటి నుంచంటే? - INTER SUPPLEMENTARY EXAMS

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ విడుదల - వచ్చే నెల 22 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడి

Inter Advanced Supplementary Exams Time Table Released
Inter Advanced Supplementary Exams Time Table Released (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 23, 2025 at 7:04 PM IST

1 Min Read

Inter Advanced Supplementary Exams Time Table Released : మంగళవారం ఇంటర్మీడియట్​ ఫలితాలు ప్రకటించిన తెలంగాణ ఇంటర్‌ బోర్డు తాజాగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. వచ్చే నెల 22 నుంచి 29వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ప్రథమ ఇంటర్‌, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు.

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌
అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ (ETV Bharat)

ఈ నెల 30 తుది గడువు : ఇంటర్మీడియట్ ఒకేషనల్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇదే టైం టేబుల్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయని అన్నారు. జూన్‌ 9న ప్రథమ ఇంటర్‌, 10న ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 30 తుది గడువు అని పేర్కొన్నారు.

సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు వివరాలు
సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు వివరాలు (ETV Bharat)

మీకొచ్చిన ఇంటర్​ మార్కులపై డౌటా? - రీకౌంటింగ్​, రీవెరిఫికేషన్​ కోసం ఇలా అప్లై చేసుకోండి!

ఒక్క మార్కు 1.85 లక్షల మంది విద్యార్థులను బలిగొంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.