Industrialists Interested in Setting up Units in Kuppam: నూతన పారిశ్రామిక పాలసీలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, తయారీ పరిశ్రమలు ఏర్పాటుకు దేశంలో ఎక్కడా లేని రీతిలో కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు దృష్టి సారించారు.
ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రిసిటీ మీటర్లు ఆటోమేటిక్ వంట తయారు చేసే పరికరాలు ఆవు పేడతో ఇటుకలు, రంగుల తయారీ ఇలాంటి వినూత్న తయారీ పరికారాల తయారీకి ఏపీ కేంద్రం కానుంది. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి తయారు చేసేందుకు పలు సంస్థలు దృష్టి పెడుతున్నాయి. కుప్పంలోని పారిశ్రామిక క్లస్టర్లో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రభుత్వం సైతం వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశాలిస్తామని హామీ ఇవ్వడంతో అనుమతి సహా ప్రోత్సాహక ఆదేశాల కోసం పారిశ్రామిక వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి.
సస్టేక్ ఇన్నోవేషన్స్: ఇంటికి వెలుగులు, పంటకు మోటర్ల ద్వారా నీరందించి పచ్చదనాన్ని ప్రసాదించడంలో విద్యుత్ సహా స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్ల పాత్ర కీలకమైంది. ఎంత రీడింగ్ నమోదైందో, ఎంత బిల్లు అయిందో సెల్‌ఫోన్ లోని క్లిక్‌తో తెసుకోవచ్చు. నిర్ణీత యూనిట్లు దాటకుండా ముందుగానే అలర్ట్ ఇచ్చే యంత్రాలతో కూడిన స్మార్ట్ మీటర్లూ తయారయ్యాయి. రైతులకు మేలు కల్గించే విద్యుత్ మీటర్లూ రాష్ట్రానికీ త్వరలో రాబోతున్నాయి. హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లో తయారైన ఈ తరహా మీటర్లు తయారు చేసే సంస్థలు తమ ఉత్పత్తి యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. వివిధ రకాల సరికొత్త, వినూత్న విద్యుత్ తయారు చేసే సస్టేక్ ఇన్నోవేషన్స్ అనే ఓ సంస్థ రాష్ట్రంలో కుప్పంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లో తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
ఇప్పటి వరకు వంటను సొంతంగా తయారు చేసుకోవాల్సిందే తప్ప ఆటోమేటిక్ గా తయారు చేసే యంత్రాలు మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. పలు రకాల వంటకాలను ఆటోమేటిక్‌గా తయారు చేసే రోబోట్ యంత్రాన్నీ మెమూ అనే ఓ సంస్థ తయారు చేస్తోంది. పరిశ్రమ ఏర్పాటునకు భూమిమి కేటాయించి తగిన ప్రోత్సాహకాలు ఇస్తే కుప్పం లేదా మచిలీపట్నంలో తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు అలీప్ సంస్థ ముందుకు వచ్చింది.
ఈ ఉగాది నుంచే పీ4 విధానం- అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం: సీఎం చంద్రబాబు
ప్రస్తుతం మార్కెట్లో మట్టి, సిమెంట్, ప్లైయాష్‌తో తయారైన ఇటుకలే నిర్మాణాలకు వాడుతున్నారు. వీటి తయారీ ప్రక్రియలో వెలువడే వ్యర్థాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతోంది. వీటి నివారణకు పర్యావరణ హితమైన ఇటుకలను జెబు గ్రీన్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ హైదరాబాద్‌లో తయారు చేస్తోంది. తక్కువ ఖర్చుతో తయారు చేయడం సహా కాంక్రీట్ ఇటుక కంటే ఎక్కువ పటిష్టంగా ఉండేలా వీటిని అధునాతన విధానాల్లో తయారు చేస్తున్నారు. ఇంటి వేడిని తగ్గించడం సహా మానవులకు ఉపయుక్తమయ్యేలా ఇటుకలను తయారు చేసే ఈ సంస్థ కుప్పంలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
యూనిస్టింగ్ టెక్ సెల్యూషన్స్: వీఐపీలకు భద్రత కల్పించడం సవాల్‌గా మారింది. డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు రవాణా చేస్తూ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోన్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. డ్రోన్ల ద్వారా వచ్చే ముప్పును ముందుగానే పసిగట్టి హెచ్చరికలు పంపడం సహా ప్రమాదాన్ని నివారించే అధునాతన సరికొత్త వ్యవస్థను యూనిస్టింగ్ టెక్ సెల్యూషన్స్ అనే సంస్థ తయారు చేసింది. రాష్ట్రంలో కుప్పం సహా ఇతర ఏ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటునకు అవకాశం ఇస్తే తయారీ సంస్థను నెలకొల్పుతామని సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారు.
పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు: మహిళలు స్వశక్తితో, సృజనాత్మకతతో తయారు చేసిన వినూత్న పరికరాలు, ఆహార పదార్థాలు, మిల్లెట్స్‌తో తయారు చేసిన విభిన్న రకాల తినుభండారాలు, ఔషద ఉత్పత్తులతో, పిల్లలకు పాలు పట్టే డబ్బాలను శుద్ది చేసే ఆటోమేటిక్ పరికరాలు తదితర స్టాళ్లను ఏర్పాటు చేశారు. వినిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మహిళల ద్వారా తయారు చేసిన ఈ తరహా పలు ఉత్పత్తులు, యూనిట్లు ప్రదర్శనకు విజయవాడలో ఇటీవల ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ వేదికైంది.
సీఎం చంద్రబాబు సహా ఆయన సతీమణి ఇద్దరూ వేర్వేరుగా వచ్చి స్టాళ్లను, ఉత్పత్తులను పరిశీలించారు. అద్భుతంగా తయారుచేశారని మెచ్చుకున్నారు. మహిళల ద్వారా ఆయా పరిశ్రమలను రాష్ట్రంలోని వివిధ క్లస్టర్లలో ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. అలీప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనుకూలత ఉన్న ప్రాంతాల్లో ఆయా పరిశ్రమల ఏర్పాటునుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రక్రియ పూర్తైతే ఏపీ కేంద్రంగా ఈ తరహా వినూత్న పరికరాలన్నీ అందుబాటులోకి రావడం సహా మెరుగైన సేవలందించనున్నాయి.
‘టెస్లా’ కోసం భూములు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం - ఆ జిల్లాలో 500 ఎకరాలు పరిశీలన
అమరావతిలో సబర్బన్ రైళ్లు - ORRతో పాటు రైల్వేలైన్‌కు ప్రణాళికలు