ETV Bharat / state

రాష్ట్రంలో మరింతగా పెరుగుతున్న వరద నష్టం- అంచనా కమిటీ నియామకం - Flood Damage in AP

Flood Damage in AP: వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో నష్టం పెరుగుతోంది. ప్రాథమిక అంచనా మేరకు 6,882 కోట్లు నష్టం వాటిలినట్టు కేంద్రానికి నివేదిక పంపారు. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తి స్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ ప్రక్రియ చేపట్టారు. వరదలు, నష్ట పరిహారం అంచనా, సహాయ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 1:33 PM IST

Flood Damage in AP
Flood Damage in AP (ETV Bharat)

Flood Damage in AP : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అనుకోని విపత్తు కారణంగా భారీ నష్టం వాటిల్లింది. వరద ప్రభావం క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతుండంతో జరిగిన నష్టం వెలుగు చూస్తోంది. వరదలు, వర్షాల కారణంగా వరద నష్టం అంచనాలు పెరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా మేరకు 6,882 కోట్ల మేర నష్టం వాటిలినట్టు కేంద్రానికి నివేదిక పంపారు.

Heavy Rains in Andhra Pradesh : వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తి స్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. వరద ముంపులో ఉన్న ప్రతీ ఇంటిని, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో ఎన్యుమరేషన్ ప్రక్రియ చేస్తున్నారు. 4.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 49 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 200 ఎకరాల్లో సెరీకల్చర్ కు నష్టం జరిగింది.

బుడమేరు కన్నీరు - సర్వం తుడిచి పెట్టేసిందని ఘొల్లుమంటున్న బాధితులు - Home Appliances damage

Flood Damage in Vijayawada : రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా 5921 కిలో మీటర్ల మేర రహదారులు ధ్వంసం అయ్యాయి. రాష్ట్రంలో 540 పశువులు మృతి చెందాయి. కిలో మీటర్ల మేర 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు దెబ్బతిన్నాయి. 76 సబ్ స్టేషన్లు ముంపు బారిన పడ్డాయి. వరదలకు 1283 ఎల్టీ ఎలక్ట్రిక్ పోల్స్, 1668 11 కేవీ ఎలక్ట్రిక్ పోల్స్ దెబ్బతిన్నాయి. బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 405 చోట్ల కాల్వలకు చెరువులకు గండ్లు పడ్డాయి.

ఏపీకి 6,880 కోట్లు ఇవ్వండి - కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం మధ్యంతర నివేదిక - AP Floods Damage Report

Cabinet Committee on Floods Enumeration : ఆంధ్రప్రదేశ్​లో వరదలు, నష్ట పరిహారం అంచనా, సహాయ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, పురపాలక శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్​లు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ పర్యవేక్షణ, వరద ముంపు నివారణ చర్యలు తదితర అంశాలపై మంత్రులు కమిటీ సిఫార్సులు చేయనుంది. మంత్రుల కమిటీకి కన్వీనర్‌గా రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉండనున్నారు. మరోవైపు విజయవాడ వరద ముంపు సహాయ చర్యలు, శానిటేషన్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారిగా కె.కన్నబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శానిటేషన్ పర్యవేక్షణ చేస్తున్న హరినారాయణ స్థానంలో కన్నబాబును నియమిస్తూ ఆదేశాలిచ్చింది.

కృష్ణమ్మ ప్రకోపానికి అన్నదాత విలవిల - వేలాది ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయిన పంటలు - Crops loss due to Krishna Floods

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.