ETV Bharat / state

మీ పిల్లల ముందు గొడవ పడుతున్నారా? - వారిలో ఈ మార్పులు రావచ్చు!

మీ పిల్లలు మంచి నడవడిక, ఆరోగ్యంగా ఉంటాలనుకుంటున్నారా? - అయితే ఈ టిప్స్ పాటించండి చాలు

Parenting Tips In Telugu
Parenting Tips In Telugu (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : October 13, 2025 at 4:37 PM IST

3 Min Read
Choose ETV Bharat

Parenting Tips In Telugu : సూర్యాపేట జిల్లాలో ఓ తండ్రి ఇంట్లోనే పొగ తాగేవాడు. తండ్రి తాగుడును రోజూ చూసిన తొమ్మిదో తరగతి చదివే తన కుమారుడు పొగ తాగడం మొదలుపెట్టాడు.

తల్లిదండ్రుల మధ్య జరిగే కలహాల టైంలో వాడే భాషకు అలవాటు పడిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ బాలిక చుట్టుపక్కల నివసించే వారితో అమర్యాదగా ప్రవర్తించింది. ఇది ఆ కుటుంబానికి సమస్యగా మారింది.

ఊహ తెలియని పసివాడు 10 మందిలోనైనా కన్నతల్లిని గుర్తిస్తాడు. తల్లిదండ్రుల స్పందనలే ఎదిగే వయసులో పిల్లలపై ప్రభావం చూపుతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. సర్దుబాటు కొరవడి చీటికిమాటికి భార్యాభర్తల మధ్య చోటు చేసుకుంటున్న మనస్పర్థలు, వాగ్వాదాల్లో పిల్లల క్రమశిక్షణను ఊహించలేం. పేరెంట్స్​నే అనుకరించే చిన్నారులు ఉత్తమ పౌరులుగా తయారు కావడం లేదంటే కారణం మనమే కదా.

పిల్లల విషయంలో పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే : -

  • మూడు సంవత్సరాలలోపు పిల్లలతో పేరెంట్స్​ ఎంతసేపు ఏం మాట్లాడతారు? వారితో నడుచుకునే పద్ధతి ఎలా ఉంది? అన్న విషయాలు పిల్లల మీద జీవిత కాలం ప్రభావం చూపుతాయని అమెరికన్‌ అకాడమీ ఆప్‌ పీడియాట్రిక్స్‌ సర్వే తెలుపుతోంది.
  • 2018 సంవత్సరంలో హెల్త్‌ సర్వీసెస్‌కు చెందిన సిగ్మా అనే కంపెనీ 20,000 మందితో జరిపిన అధ్యయనంలో ఎక్కువ శాతం మంది 'లోన్లీయెస్ట్‌'గా ఫీల్‌ అవుతున్నారట. అందుకు వారు చిన్నతనంలో ఒంటరిగా పెరగడమే ఇందుకు కారణమట.

పిల్లలకు ఇవి నేర్పించండి : -

  • చిన్నప్పటి నుంచే పిల్లల్లో బాధ్యతను అలవర్చాలి. రోజువారి పనుల్లో వయసుకు తగిన పనులు అప్పగించాలి. ఇలా చేస్తే వారిలో క్రమశిక్షణ, ఆత్మగౌరవం, స్వాతంత్య్రం, సాఫల్య భావం కలిగిస్తుంది.
  • పిల్లలను పేరెంట్స్ బెదిరించడం, కొట్టడం వంటివి చేయకుండా మంచి ప్రవర్తనను ప్రశంస, బహుమతులతో ప్రోత్సహించాలి.
  • రోజూ పిల్లలతో ఆడుకోవడం, మాట్లాడటం, పాఠశాల విషయాలను తెలుసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు.
  • వారిని వేరే పిల్లలతో పోల్చవద్దు. దీంతో తల్లిదండ్రులంటే ద్వేషం, కోపం కలుగుతాయి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సృజన, విజ్ఞతతో ఎలా పరిష్కరించుకోవాలో నేర్పించాలి. పిల్లలతో కలిసి భోజనం చేయాలి.

పిల్లలతో ఇలా చేయకండి : పిల్లల ముందు పేరెంట్స్ కోపతాపాలకు పోవడం, తగవులాడుకోవడం, గొడవలు, తిట్టుకోవడం, అసభ్య పదజాలాలు ఉపయోగించుకోడం తదితరాలు చేయకుడదు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటే మంచి పిల్లలుగా రూపుదిద్దుకుంటారు. అమ్మానాన్నలు ప్రేమగా ఉన్నారా? ఎవరు తనతో అత్యధిక ప్రేమ చూపిస్తున్నారనే విషయాలు చిట్టి బుర్రలో గట్టి ముద్రనే వేస్తాయట. ఏదైనా తేడా అనిపిస్తే పిల్లల మానసిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

పేరెంట్స్ రోల్‌ మోడల్‌గా ఉండాలి : అమ్మానాన్నలే రోల్‌ మోడల్‌ పిల్లలు మాట వినడం లేదని, లేనిపోని అలవాట్లు నేర్చుకుంటున్నారంటూ పలువురు పేరెంట్స్ హాస్పిటల్​కి వస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన మానసిక వైద్య నిపుణులు డాక్టర్​ ఉస్మాన్ తెలిపారు. పిల్లలకు పేరెంట్స్ రోల్‌ మోడల్‌గా ఉండాలని సూచించారు. పిల్లలకు ఏం కావాలో తెలుసుకోవాలని, వారిని అర్థం చేసుకొని ఏ విషయాన్ని అయినా సున్నితంగా వివరించాలని చెప్పారు. వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని వివరించారు.

"పిల్లలు మాట వినడం లేదు, లేనిపోని అలవాట్లు నేర్చుకుంటున్నారంటూ పలువురు పేరెంట్స్ హాస్పిటల్​కి వస్తున్నారు. పిల్లలకు పేరెంట్స్ రోల్‌మోడల్‌గా ఉండాలి. పిల్లలకు ఏం కావాలో తెలుసుకోవాలి. వారిని అర్థం చేసుకొని ఏ విషయాన్ని అయినా సున్నితంగా వివరించాలి. వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి."- డా.ఉస్మాన్, మానసిక వైద్య నిపుణులు, హైదరాబాద్‌

పిల్లల విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి! - మీకు తెలియకుండా జరుగుతున్నది ఇదే!

క్షణికావేశంలో తల్లిదండ్రుల తప్పటడుగులు - శిక్ష అనుభవిస్తున్న పిల్లలు!

పిల్లల ముందు గొడవ పడుతున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!