ETV Bharat / state

పాలలో కల్తీని గుర్తించాలా? - ఇలా చేస్తే ఈజీగా తెలిసిపోతుంది - DETECTED ADULTERATED MILK

పాల ఉత్పత్తి సరిగ్గా లేకపోవడంతో కల్తీ పాలకు తెర లేపుతున్న అక్రమార్కులు - చిక్కదనం కోసం పిండి పదార్థాలు, కొవ్వు, నూనెలు వాడుతున్న వైనం - క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందంటున్న వైద్య నిపుణులు

Adulterated Milk
Adulterated Milk (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 11, 2025 at 10:25 AM IST

2 Min Read

Adulterated Milk : ప్రస్తుతం పాలు, పాల పదార్థాలు లేకుండా ఇంట్లో రోజు గడవని పరిస్థితి. టీ, కాఫీలతో పాటు పిల్లలు తాగేందుకు, పెరుగు తోడు పెట్టుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పాలను ఉపయోగిస్తున్నారు. కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయ డెయిరీ ద్వారా రోజుకు సుమారు 10 వేల లీటర్లు, 20 ప్రైవేటు డెయిరీల నుంచి 70 వేల లీటర్ల పాల సౌలభ్యం ఉంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు రోజుకు కనీసం లక్షన్నర లీటర్ల వరకు పాలు అవసరమవుతున్నాయి. ఉత్పత్తి జనాభాకు సరిపడా లేక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

తస్మాత్‌ జాగ్రత్త : అవసరాలకు తగిన ఉత్పత్తి లేకపోవడంతో అక్రమార్కులు పాల కల్తీకి పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఖమ్మం నగరంలో కల్తీ పాల విక్రయాలు కలకలం సృష్టించాయి. కొంతమంది పాలల్లో నీళ్లు కలిపి విక్రయిస్తే, మరికొందరు ఏకంగా కృత్రిమంగా తయారు చేస్తున్నారు. చిక్కదనం కోసం పిండి పదార్థాలను, కొవ్వు శాతం ఉండేలా రకరకాల నూనెలు కలుపుతున్నారు.

బోరిక్‌ యాసిడ్‌, బెంజాయిక్‌ యాసిడ్‌, అమ్మోనియా సల్ఫేట్‌, కాస్టిక్‌ సోడా, డిటర్జెంట్లు, క్లోరిన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, సాలిసిక్‌ యాసిడ్‌ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నారు. మాల్టోడెక్స్‌ట్రిన్‌ అనే పిండి పదార్థాన్ని జన్యుమార్పిడీ చేసిన మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. దీని గ్లైకమిక్స్‌ ఇండెక్స్‌ (చక్కర స్థాయిని చూపేది) 105 నుంచి 130 వరకు ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. పేగు వాపు మొదలుకొని బరువు పెరగటం, క్యాన్సర్‌, అలర్జీకి దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కనిపెట్టడం ఇలా : నున్నటి గ్రానైట్‌ రాయిపై చుక్క పాలు వేస్తే త్వరగా జారిపోతే అవి మంచి పాలని అర్థం. అదే నెమ్మదిగా జారితే అవి కల్తీవని గుర్తించాలి. పాలల్లో కొన్ని చుక్కల అయోడిన్‌ ద్రావణాన్ని కలిపితే అవి వెంటనే నీలి రంగులోకి మారితే అందులో పిండి పదార్థం కలిపినట్లే. అర టేబుల్‌ స్పూన్‌ సోయాబీన్‌ పిండిని ఒక చెంచా పాలతో కలిపి కొద్దిసేపు అలా తిప్పాలి. 5 నిమిషాల తర్వాత దానిలో రెడ్‌ లిట్మస్‌ కాగితాన్ని ముంచినప్పుడు అది నీలి రంగులోకి మారితే అందులో యూరియా కలిపినట్లు. పాలలో నీళ్లు కలిపి కలియబెడితే నురగ వస్తే అందులో డిటర్జెంట్‌ కలిపినట్లు.

తలసరి నెలవారీ వినియోగం

కిలో గ్రాములలో ఇలా

పదార్థాలుగ్రామీణ ప్రాంతంపట్టణ ప్రాంతం
పాలు లీటర్లలో3.865.09
పిల్లల ఆహారం0.020.4
పెరుగు0.590.89
నెయ్యి0.020.05
ఇతర పాల పదార్థాలు----0.13

అతడు పోసిన 'పాలు' తాగి మంచం పట్టిన ఫ్యామిలీ - అసలు ఏం జరిగిందంటే?

అనారోగ్యాల బారిన పడేస్తున్న కల్తీ పా"పాలు" - ప్రజారోగ్యంపై తీవ్ర అనర్థాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.