ETV Bharat / state

ఓనర్లు! మైనర్లకు వాహనం ఇస్తున్నారా? - అయితే మీ వాహన రిజిస్ట్రేషన్​ రద్దే

హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు చర్యలు - మైనర్లకు వాహనం ఇస్తే వాహనం రిజిస్ట్రేషన్​ రద్దు - మైనర్లకు 25 ఏళ్లు వచ్చే వరకు నో డ్రైవింగ్​ లైసెన్స్​

minors driving
minors driving (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 4, 2025 at 8:26 PM IST

1 Min Read
Choose ETV Bharat

Hyderabad Traffic Police New Rules : హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో మైనర్ల డ్రైవింగ్​ నియంత్రణకు చర్యలు చేపట్టారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనం యజమానులు కూడా బాధ్యులేనని చెప్పారు. మైనర్లు నడిపిన వాహనం రిజిస్ట్రేషన్​ ఏడాది పాటు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే మైనర్లు 25 ఏళ్లు వచ్చేవరకు లైసెన్స్​ పొందడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు.