Anemia Diagnosis Without Samples : మనుషుల్లో రక్తహీనతను తెలుసుకునేందుకు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ పరిశోధకులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. కనుగుడ్డు కింద ఎరుపురంగులో ఉన్న వలయాన్ని స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి కృత్రిమ మేథతో విశ్లేషించి క్షణాల వ్యవధిలో రక్తహీనతను నిర్ధారించవచ్చు. అలా విశ్లేషించినప్పుడు ఆ వలయం గులాబీ, లేత ఆకుపచ్చ, నీలం రంగులో ఏదో ఒకదాంట్లో కనిపిస్తే రక్తహీనత ఉన్నట్లుగా నిర్ధారించినట్లు. అయితే, ఏ రంగు కనిపిస్తే ఎంత తీవ్రత ఉందో అన్న విషయాన్ని కనుక్కునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం రక్తహీనతను తెలుసుకునేందుకు డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా ట్రిపుల్ ఐటీ పరిశోధకులు ఈ విధానాన్ని కనుగొన్నారు. ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించి వైద్యనిపుణులతో చర్చించి ఇది సరైన విధానమేనని ధ్రువీకరించుకున్నారు. గ్రామీణ మహిళలకు ముఖ్యంగా గర్భిణులకు ఈ విధానంతో ప్రయోజనం చేకూరనుందని పరిశోధకులు వివరించారు.
రంగు ఆధారంగా తీవ్రతపై పరిశోధనలు : కనుగుడ్డు కింద వలయం రంగు ఫొటోను కృత్రిమమేధతో విశ్లేషించడం ద్వారా రక్తహీనతను గుర్తించవచ్చని శాస్త్రీయంగా నిరూపించామని ట్రిపుల్ ఐటీ పరిశోధకుడు అర్జున్ రాజశేఖర్ తెలిపారు. బిహార్‌లో ఒక స్వచ్ఛంద సంస్థ కొద్దినెలల క్రితం 18 గ్రామాలను ఎంపిక చేసుకుని 2,800 మంది గర్భిణుల రక్త నమూనాలను సేకరించిందని, వాటిని ప్రయోగశాలలో పరీక్షించిన అనంతరం 60 శాతం మందికి రక్తహీనత ఉన్నట్టు నిర్ధారించిందని వివరించారు. రక్త నమూనాలు సేకరించేటప్పుడే కళ్ల ఫొటోలు తీయాలంటూ సంస్థ ప్రతినిధులను అభ్యర్థించారని, వారు ఫొటోలు తమకు పంపించిన తర్వాత కృత్రిమ మేధతో విశ్లేషించామన్నారు. వైద్యులు ధ్రువీకరించిన రక్తహీనత నమూనాలు, వారు విశ్లేషించిన ఫొటోలను విశ్లేషించగా 94 శాతం కేసుల్లో ఫలితాలు సరిపోలాయని చెప్పారు.
శాపంగా మారుతున్న తలసేమియా వ్యాధి - స్వచ్ఛంద సంస్థల సాయమే కీలకం
వయసొచ్చిన అమ్మాయిలు, పీరియడ్స్‌లో స్త్రీలు తప్పక తినాల్సిన "సున్ని సంగటి" - పాతకాలంలో ఇదే తినేవారు!