ETV Bharat / state

విపత్తు వేళ పరిమళించిన మానవత్వం- సీఎం సహాయనిధికి పెద్దఎత్తున విరాళాలు - Donations To AP Flood Victims

Donations To AP Flood Victims : వరద బారిన పడి సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకొస్తున్నారు. సహాయక చర్యలను చేపడుతున్న ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు వివిధ వర్గాలు, ప్రాంతాల వారు విరాళాలను అందిస్తున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 1:35 PM IST

Updated : Sep 10, 2024, 10:45 PM IST

Donations to AP CMRF
Donations to AP CMRF (ETV Bharat)

Donations to AP CMRF : రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వరద బాధితులను ఆదుకునేందుకు సర్వేపల్లి నియోజకవర్లంలోని పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి రూ.2.97 కోట్ల విరాళం ఇచ్చారు. జెమిని ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ లిమిటెడ్ రూ.2 కోట్లు, సెయిల్‌ సెమ్‌ కార్ప్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు రూ.50 లక్షలు, ఇతర పామాయిల్‌ పారిశ్రామిక వేత్తలు రూ.47 లక్షలు ఇచ్చారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి నేతృత్వంలోవారు సీఎం చంద్రబాబును కలిసి చెక్‌ను అందజేశారు. దాతలందరికీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

వరద బాధితుల కోసం ఎక్సైజ్‌ శాఖ ఉద్యోగులు మరోసారి ఆపన్న హస్తం అందించారు. ఇప్పటికే ఎపీ ఎన్జీవో తరఫున ఒకరోజు వేతనాన్ని విరాళం ఇచ్చిన వారు, మరో రోజు జీతాన్ని కూడా సీఎం సహాయనిధికి ఇచ్చారు. ఈ మేరకు ఏపీబీసీఎల్ తరఫున కోటి రూపాయల విరాళం ప్రకటించారు. మొత్తంగా ఎక్సైజ్ శాఖ నుంచి రూ.2.70 కోట్లు అందించారు

Electricity Department Employees JAC Leaders Donation : విజయవాడ వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగులు అండగా నిలిచారు. ఒక్క రోజు జీతం రూ.10.61 కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్​కు విరాళంగా ఇచ్చారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో వారు సీఎం చంద్రబాబును కలిసి చెక్​ను అందించారు. విద్యుత్ ఉద్యోగులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు అందించడంతోపాటు బాధితులకు ఆర్థిక సహాయమూ అందించారని మంత్రి గొట్టిపాటి కొనియాడారు.

సీఎంకు భారీగా విరాళాలు అందించిన దాతలు : మరోవైపు విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేశారు. కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.3 కోట్లను కియా ఇండియా సీఈవో కబ్ డాంగ్ లీ అందించారు. నారాయణ విద్యాసంస్థల నుంచి రూ.2.50 కోట్ల చెక్కును సింధూర, శరణి, పునీత్, ప్రేమ్‌సాయి ఇచ్చారు. దేవీ సీఫుడ్స్ తరఫున పొట్రు బ్రహ్మానందం, రమాదేవి రూ.2 కోట్లు అందజేసింది.

Actor Simbu Donations To Flood Victims : అవంతి ఫీడ్స్ నుంచి అల్లూరి ఇంద్రకుమార్, నిఖిలేష్ రూ.2 కోట్లు విరాళం ఇచ్చారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్ధం తమిళ నటుడు శింబు విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎంల సహాయనిధికి రూ.3 లక్షల చొప్పున విరాళం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వరద బాధితులకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. శివశక్తి బయోటెక్నాలజీస్, శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ సాయాన్ని అందిచనున్నట్లు తెలిపారు. త్వరలోనే సీఎంను కలిసి రూ.25 లక్షల చెక్కును అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బొల్లాపల్లి టీడీపీ పార్టీ నేతలు 40 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసరాలు పంపించారు. బల్లికురవ గ్రానైట్‌ అసోసియేషన్‌ రూ.57 లక్షల విరాళాన్ని మంత్రి గొట్టిపాటి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసి అందజేసింది.

వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి విశాఖ క్రెడాయి రూ.10 లక్షలు విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును క్రెడాయి అధ్యక్షుడు ధర్మేందర్, ఛైర్మన్‌ రాజు అందజేశారు. తిరుమల కళాశాల అధినేత తిరుమలరావు రూ.50 లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. తమ నెల వేతనం రూ.3.92 కోట్లు విరాళంగా ఇచ్చిన సర్పంచులు, అదేవిధంగా నెల వేతనం రూ.7.7 కోట్లను పంచాయతీరాజ్ ఛాంబర్ ఇచ్చింది.

వరద బాధితులకు గ్రామ సర్వేయర్లు రూ.80 లక్షలు ఇచ్చారు. విజయవాణి ప్రింటర్స్ యజమాని ఎన్‌.చంద్రకళ (పుంగనూరు) రూ.25 లక్షలు, సీవెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత ఎం.వీరసత్య (విజయవాడ) రూ.10 లక్షలు, ఎకోరెన్ ఎనర్జీ ఎండీ ఎర్నేని లక్ష్మీప్రసాద్ రూ.1 కోటి విరాళాలుగా అందించారు. సీఎం సహాయనిధికి సీఐఐ ఏపీ చాప్టర్‌ రూ.4 కోట్ల విరాళం ప్రకటించింది. సీఐఐ ఏపీ అధ్యక్షుడు మురళీకృష్ణ చంద్రబాబుని కలిసి చెక్కును అందజేశారు. ఇందులో రూ.2.77 కోట్ల విలువైన ఆహారం, నీరు, ఇతర వస్తువులు అందించామని మురళీకృష్ణ తెలిపారు.

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ : ఎర్నేని లక్ష్మీప్రసాద్ రూ.1 కోటి, ఎకోరెన్ ఎనర్జీ ఎండీ వీసీ. జనార్థన్‌రావు రూ.1 కోటి, ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ రూ.50 లక్షలు, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్​ యాదవ్ రూ.25 లక్షలు, విష్ణు కెమికల్స్ లిమిటెడ్ అధినేత కృష్ణమూర్తి రూ.25 లక్షలు, రేస్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ డైరెక్టర్ గరుడపల్లి రూ.25 లక్షలు, అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ.25 లక్షలను విరాళాలుగా అందజేశారు. మరోవైపు రాష్ట్రంలోని ఐఏఎస్​లు తమ ఒకరోజు వేతనాన్ని వరద బాధితులకు విరాళంగా ప్రకటించారు.

వరద బాధితులకు పోలీసుల సాయం-ఒకరోజు వేతనం 12 కోట్ల విరాళం - Huge Donations to CMRF AP

వరద బాధితులకు అండగా టాలీవుడ్​ హీరోలు - తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం - Donations To Telugu States

Last Updated : Sep 10, 2024, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.