Huge Devotees To Tirumala Tirupati Temple : తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాలలో తరలి రావటంతో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ కొంత ఆలస్యమవుతోంది. దీంతో వాహనాలు గో మందిరం వరకు బారులు తీరాయి. వాహనాలను తనిఖీ చేసి తిరుమలకు అనుమతించడానికి టీటీడీ అధికారులు చర్యలు చేపట్టి వాహన రద్దీని నియంత్రిస్తున్నారు.
Justice Dheeraj Singh Thakur Chief Justice of State High Court Visits Tirumala : రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు కుటుంబ సమేతంగా చేరుకున్న సీజేకు స్వాగతం అదనపు ఈవో వెంకయ్యచౌదరి పలికారు. అనంతరం గర్భాలయంలోకి వెళ్లిన సీజే దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో హైకోర్టు సీజేకు పండితులు ఆశీర్వచనం అందజేయగా, శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను వెంకయ్య చౌదరి అందజేశారు.
రాష్ట్ర మంత్రి నారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలోకి వెళ్లిన మంత్రి నారాయణ దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారిని 84,536 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,890 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చింది.
తిరుమల కల్తీ నెయ్యి కేసు అప్డేట్ - నలుగురి రిమాండ్
తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం - సీబీఐ అదుపులో నలుగురు నిందితులు