How To Register As A New Voter : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలకు చాలా ప్రాముఖ్యం ఉంది. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి. ఓటు హక్కు అనేది సామాన్యుని చేతిలో ఉన్న వజ్రాయుధం. 18 ఏళ్లు నిండిన యువతి, యువకులకు ఓటు హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. నూతన ఓటరు నమోదు అనేది నిరంతర ప్రక్రియ.
ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి : నూతనంగా ఓటరు నమోదుకు గతంలో ఎలక్షన్ కమిషన్ జనవరి ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారిని మాత్రమే అవకాశం కల్పించేది. కానీ ఇప్పుడు ప్రతి ఏటా 4 సార్లు జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఈ ఏప్రిల్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరు నమోదుకు అర్హులు.
ఇలా ఓటు నమోదు చేసుకోండి :
- 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫారం-6 : 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు.
- ఫారం-7 : స్థానికంగా లేని ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఈ ఫారంని ఉపయోగిస్తారు. వలస వెళ్లిన వారు (మైగ్రేటెడ్), రెండు చోట్ల పేరున్న వారు, చనిపోయిన వారి పేర్లను తొలగించుకోవచ్చు.
- ఫారం -8 : ఓటరు పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటివి సవరించుకోవచ్చు. ఒక పోలింగ్ సెంటర్ నుంచి మరో కేంద్రానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
- ఆన్లైన్లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్లో కూడా ఓటరు నమోదు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో స్థానిక బీఎల్వో, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు - తిరస్కరణ ఎందుకు చేస్తారో తెలుసా? - Postal Ballot Counting 2024