ETV Bharat / state

తత్కాల్​ టికెట్​ బుకింగ్ రూల్స్​ మారాయ్​ - 'ఆధార్'​ తప్పనిసరి - IRCTC AADHAR AUTHENTICATIONPROCESS

తత్కాల్​ టికెట్​ బుకింగ్​కు సంబంధించి కొత్త రూల్స్​ - ఐఆర్​సీటీసీ యూజర్​ ప్రొఫైల్​కు ఆధార్​ అథెంటికేషన్​ చేస్తేనే టికెట్​లు బుక్​ చేసుకునే అవకాశం

IRCTC Aadhar Authentication Process
IRCTC Aadhar Authentication Process (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 21, 2025 at 8:05 PM IST

Updated : June 26, 2025 at 10:13 AM IST

1 Min Read

IRCTC Aadhar Authentication Process : రైల్వే ప్రయాణికులకు బిగ్​ అలర్ట్​. తత్కాల్​ బుకింగ్​కు సంబంధించి ఐఆర్​సీటీసీ పలు కీలక మార్పులను చేసింది. ఇకపై ఆధార్​ అథెంటికేషన్ పూర్తి చేసిన వారికి మాత్రమే ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​, మొబైల్​ యాప్స్​లో టికెట్​ బుక్​ చేసుకునేందుకు వీలుంది. తత్కాల్​ టికెట్​ బుకింగ్​కు సంబంధించి జులై 1 నుంచి ఈ కొత్త రూల్స్​ అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి ఐఆర్​సీటీసీ కస్టమర్​ సపోర్ట్​ విభాగం కీలక ప్రకటన విడుదల చేసింది.

వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ విధంగా చేస్తున్నట్లు పేర్కొంది. ఎలాంటి అసౌకర్యం లేకుండా టికెట్​ బుక్​ చేసుకునేందుకు ప్రయాణికులు వారి ఐఆర్​సీటీసీ యూజర్​ ప్రొఫైల్​ను ఆధార్​తో అథెంటికేషన్​ చేసుకోవాలని సూచించింది. ఆధార్​ అథెంటికేషన్ ప్రాసెస్​ ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్​ అథెంటికేషన్ ప్రాసెస్​ : ఈ సింపుల్​ స్టెప్స్​ పాటించి మీరు ఆధార్​ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు

  • ముందుగా www.irctc.co.in లేదా ఐఆర్​సీటీసీ రైల్​ కనెస్ట్​ మొబైల్​ యాప్​లోకి లాగిన్​ అవ్వండి
  • అందులో మై అకౌంట్​ సెక్షన్​ను సందర్శించి అథెంటికేట్​ యూజర్​ అనే ఆప్షన్​పై క్లిక్ చేయండి
  • అథెంటికేట్​ యూజర్​ అనే ఆప్షన్​లో వచ్చే సూచనలు పాటించండి
  • మీ ఆధార్‌కు అనుసంధానం అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయండి.
  • ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక మీరు ఇక తత్కాల్​ టికెట్లు బుక్​ చేసుకోవచ్చు.
IRCTC Aadhar Authentication Process
తత్కాల్​ టికెట్​ బుకింగ్ రూల్స్​ మారాయ్​ - 'ఆధార్'​ తప్పనిసరి (ETV Bharat)

మీ ట్రైన్ క్యాన్సిల్ అయ్యిందా? - టికెట్ల డబ్బులు తిరిగి ఇలా పొందండి

రైలు ప్రయాణికులకు గుడ్​న్యూస్​ - ఇక చాటింగ్​తోనే రైలు టికెట్​

Last Updated : June 26, 2025 at 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.