ETV Bharat / state

మీ పిల్లల కోసం మంచి జూనియర్​ కాలేజ్​ను ఎంచుకోవాలా? - ఈ అంశాలు మస్ట్​గా చెక్​ చేయండి - TIPS TO CHOOSE JUNIOR COLLEGE

జూనియర్​ కాలేజ్​లను ఎంచుకోవడం ఎలా? - పిల్లల్ని చేర్చే ముందు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? - నిపుణులు చెప్పే సూచనలు ఇవే!

How to Choose Junior College
How to Choose Junior College (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 21, 2025 at 9:22 AM IST

3 Min Read

How to Choose Junior College : ఇంజినీరింగ్​, ఫార్మసీ, మేనేజ్​మెంట్​ తదితర వృత్తి విద్య కోర్సులను అందించే కళాశాలలు నాణ్యమైనవా? కాదా? అనేది తెలుసుకునేందుకు న్యాక్​, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్​ఐఆర్​ఎఫ్​ ర్యాంకింగ్​, తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ మండలి ఖరారు చేసే ఫీజుతో అవకాశం ఉంది. కానీ జూనియర్​ కళాశాలలను గుర్తించాలంటే ఇలాంటి ప్రామాణిక కొలమానాలు ఏవీ ఉండవు. జేఈఈ, నీట్​, ఎప్​సెట్​ పేరు చెప్పి ఎంత ఫీజు వసూలు చేస్తున్నా, నియంత్రించే యంత్రాంగమూ లేదు. అందుకే తమ పిల్లల్ని ఏ కళాశాలలో చేర్పించాలనే అయోమయంలో తల్లిదండ్రులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కొన్ని అంశాలను తెలుసుకోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,400 వరకు ప్రైవేటు జూనియర్​ కాలేజీలు ఉండగా, ప్రతి ఏటా ఇంటర్​లో సుమారు రూ.4.80 లక్షల మందిపైగా విద్యార్థులు చేరుతున్నారు. అందులో కేవలం ప్రైవేటు జూనియర్​ కళాశాలల్లోనే దాదాపు 3 లక్షల మంది వరకు ప్రవేశాలు పొందుతున్నారు. 217 ప్రైవేటు కళాశాలలు గృహ, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్నందున ఆయా యాజమాన్యాలు ఏటా షరతులతో అనుమతులు పొందుతున్నాయి. ఇందులో హైదరాబాద్​, మేడ్చల్​, రంగారెడ్డి జిల్లాల్లోనే 90 శాతం ఉన్నాయి.

మీరు ప్రవేశాలు పొందే ముందు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్​లో (www.tsbie.cgg.gov.in) ‘అఫిలియేటెడ్‌ కాలేజెస్‌’ అనే చోట క్లిక్‌ చేస్తే అనుమతులు ఉన్న కళాశాలల జాబితా ఉంటుందని, వాటికి మాత్రమే బోర్డు అనుమతి ఉన్నట్లు భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ వెబ్‌సైట్‌ను చూస్తే మీ పిల్లలు చేరిన కళాశాలకు అనుమతి ఉందో లేదో తెలిసిపోతుందని సూచనలు చేస్తున్నారు. పిల్లల అభిరుచులు, శక్తి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని కళాశాలను, గ్రూపును ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి తమ కుమారుడు/ కుమార్తె ఏ గ్రూపులో రాణిస్తారో తెలుసుకుంటే మరీ మంచిది’ అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి :

  • ఆయా సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు ఎవరు, వారి విద్యార్హతలు, అనుభవం తదితరాలు తెలుసుకుంటే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది.
  • ఇళ్ల దగ్గరకు వచ్చే పీఆర్వోలు చెప్పే మాయమాటలు నమ్మవద్దు. వారు మొదటి సంవత్సరానికి మాత్రమే ఫీజు చెబుతారు. ఒకసారి ప్రవేశం పొందిన తర్వాత విద్యార్థి ఎటు వెళ్లలేడనే భావనతో అనేక కళాశాలలు రెండో ఏడాది ఫీజును భారీగా పెంచుతున్నాయి. అందుకే ద్వితీయ సంవత్సరం ఫీజునూ ముందే రాతపూర్వకంగా నిర్ధారించుకోవడం ఉత్తమం.
  • హాస్టళ్లలో చేరినప్పుడు ముందుగా ఒక్కో రూమ్​లో ఎంత మంది ఉంటున్నారని తెలుసుకోవాలి. ఆ మేరకు సౌకర్యాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి
  • హాస్టల్​ మెనూను చూడటం ఉత్తమం. రెసిడెన్షియల్​ కళాశాలల్లో చేరే ఎక్కువ మంది విద్యార్థుల ఫిర్యాదు ఈ భోజనంపైనే ఉంటుంది.

ఐదంకెల నంబరు బోర్డుపైన ఉందా? :

  • కొన్ని కళాశాలలకు ఇంటర్‌బోర్డు అనుమతులు ఉండవు.
  • కొన్ని యాజమాన్యాలు ఒక దానికి అనుమతి తీసుకుని, రెండు మూడు చోట్ల బ్రాంచీలు నడుపుతాయి.

ఉదాహరణ : అమీర్‌పేటలో ఉన్న కళాశాలలో చేర్చే పక్షంలో చుట్టుపక్కల పరీక్ష కేంద్రాలు ఉంటాయని తల్లిదండ్రులు భావిస్తారు. వాస్తవంగా దానికి వేరే ప్రాంతంలో అనుమతి ఉండటంతో పరీక్ష కేంద్రం దూరంగా ఉంటుంది. అందువల్ల చేర్పించే ముందే కళాశాలకు ఇంటర్‌బోర్డు జారీ చేసిన ‘ఐదు అంకెల కళాశాల కోడ్‌’ ఉందా అనేది ఆరా తీయాలి. సాధారణంగా ఆ నంబరును కళాశాల బోర్డుపైనే రాస్తారు. అలా రాయని పక్షంలో ఆ భవనంలో నడిచే కళాశాలకు అనుమతి లేనట్లేనని భావించాలి. ఈ విషయాలను గుర్తించుకోవాలి.

పాఠాలు చెప్పడమే కాదు - విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలూ వేస్తున్నారు

భారీగా పెరగనున్న ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులు - అత్యధికంగా రూ.2.23 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.