ETV Bharat / state

మీ డ్రైవింగ్​ లైసెన్స్​ గడువు ముగిసిందా? - మీ ఫోన్​లోనే రెన్యూవల్​ చేసుకోండి ఇలా - DRIVING LICENSE RENEWAL APPLY

ఫోన్​లోనే డ్రైవింగ్​ లైసెన్స్​ రెన్యూవల్​ చేసుకోవచ్చని మీకు తెలుసా? - ఈ విధంగా చేస్తే ఈజీగా అప్లై చేసుకోవచ్చు?

Driving Licence Renewal
Driving Licence Renewal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 19, 2025 at 10:43 AM IST

2 Min Read

Driving Licence Renewal : మీరు కారు, బైకు ఇలా ఏ వాహనం నడపాలన్నా ముఖ్యంగా ఉండాల్సినవి ఆ వాహన ఆర్​సీ, ఇన్సూరెన్స్​, పొల్యూషన్​ సర్టిఫికెట్​తో పాటు ప్రధానంగా డ్రైవింగ్​ లైసెన్స్. కొత్తగా డ్రైవింగ్​ లైసెన్స్​ తీసుకున్నప్పుడు వయసు ఆధారంగా కొన్నేళ్ల గడువుతో జారీ చేస్తారు. ఈ గడువు ముగిసేలోగా రెన్యూవల్​ చేసుకోవాలి. గడువు ముగిసిన 30 రోజుల్లో రెన్యువల్​ చేసుకోకుంటే ఫైన్​ చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసి చాలా రోజులైతే జరిమానాతో పాటు మళ్లీ కొత్త డ్రైవింగ్​ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి కొత్త లైసెన్స్ మాదిరిగా పరీక్షలు ఎదుర్కోవాల్సిందే.

అందుకే డ్రైవింగ్​ లైసెన్సుపై గడువును చూసుకుని రెన్యూవల్​ చేసుకోవడం మంచి పద్ధతి. డ్రైవింగ్​ లైసెన్సు రెన్యూవల్​ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే స్మార్ట్​ఫోన్​, కంప్యూటర్​, ల్యాప్​టాప్​లో ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్​ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి :

  • మొదట రవాణా శాఖ అధికారిక వెబ్​సైట్లోకి వెళ్లి డ్రైవింగ్​ లైసెన్సు సంబంధిత సేవల్లో డ్రైవింగ్​ లైసెన్సు రెన్యూవల్​పై క్లిక్​ చేయాలి.
  • పేజీ లోడ్​ అయిన తర్వాత స్లాట్​ బుకింగ్​ కంటిన్యూపై క్లిక్​ చేయాలి.
  • ఇప్పుడు రెన్యువల్​ ఆఫ్​ లైసెన్సును ఎంచుకుని GO పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత డ్రైవింగ్​ లైసెన్సు నెంబరు, జారీ చేసిన ఆర్టీఏ కార్యాలయం, పుట్టిన తేదీ, సెల్​ఫోన్​ నంబరు, క్యాప్చా వంటి వివరాలను నమోదు చేయాలి.
  • రిక్వెస్ట్​ ఓటీపీపై నొక్కితే మీ సెల్​ఫోన్​కి ఓటీపీ వస్తుంది. దీనిని ఎంటర్​ చేసిన తర్వాత గెట్​ డీటెయిల్స్​పై క్లిక్​ చేస్తే మన వివరాలు కనిపిస్తాయి. వీటిని పరిశీలించాకా కన్​ఫాంపై క్లిక్​ చేసి, సేవ్​ను నొక్కితే మన వివరాలు సేవ్​ అవుతాయి.
  • వచ్చిన విండోలో స్లాట్​ కోసం మనకు నచ్చిన తేదీ, సమయాలను ఎంచుకుని నెక్ట్స్​పై క్లిక్​ చేయాలి.
  • ఇప్పుడు మనం చెల్లించాల్సిన రుసుం మొత్తాన్ని పరిశీలించి పే నౌపై క్లిక్​ చేస్తే వచ్చిన పేమెంట్​ ఆప్షన్లలో మనకు అనువైన దానిని ఎంచుకుని పే చేస్తే స్లాట్​ బుక్​ అవుతుంది. మెడికల్​ ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ వస్తుంది. వీటిని ప్రింట్​ తీసుకోవాలి.
  • మెడికల్​ ఫిట్​నెట్​ సర్టిఫికెట్​ను వైద్యాధికారితో సంతకం చేయించి, ఆధార్​, ఒరిజినల్​ డ్రైవింగ్​ లైసెన్సును స్లాట్​ బుక్​ అయిన రోజున ఆర్టీఏ కార్యాలయంలో అందజేస్తే కొద్ది రోజుల్లోనే రెన్యూవల్​ అయిన డ్రైవింగ్​ లైసెన్సు వస్తుంది.

ఓనర్లు! మైనర్లకు వాహనం ఇస్తున్నారా? - అయితే మీ వాహన రిజిస్ట్రేషన్​ రద్దే

డ్రైవింగ్ టెస్ట్ ఇకపై అంత ఈజీ కాదు - సాఫ్ట్​వేర్ ఓకే అంటేనే మీకు లైసెన్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.