Minister Anitha on SC Categorisation Ordinance: ఎస్సీ కులాల వర్గీకరణ ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదించి అందరికీ సమాన న్యాయం చేసిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 2011 సెన్సెస్ ప్రకారం వర్గీకరణ జరిగిందని వెల్లడించారు. జన గణన తర్వాత జిల్లాల వారిగా వర్గీకరణ చేసి రిజర్వేషన్లు అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు తీసుకువచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నాలు చేస్తోందని పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదం ఘటన దీనికి పెద్ద ఉదాహరణ అని అన్నారు. మత పెద్దల ముసుగులో వైఎస్సార్సీపీ నేతలు కొందరు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
అన్నీ అవాస్తవాలే: తిరుపతి ఆధ్యాత్మిక ప్రదేశమని అ ప్రాంతం చాలా సెన్సిటివ్ అన్న మంత్రి ఒక అబద్దాన్ని కావాలని ప్రచారం చేసారని మండిపడ్డారు. గతంలో కూడా పింక్ డైమండ్ అని చెప్పి వైఎస్సార్సీపీ బురద చల్లిందని, అసలు పింక్ డైమండే లేదని తేలిందని గుర్తు చేసారు. అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. జగన్ తన సొంత పత్రికలో తాము 1100 మందిని భద్రతకు కేటాయిస్తే దాన్ని మొహరించారు అని రాసారన్నారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో కొందరు పాస్టర్ల ముసుగులో మాట్లాడకూడని మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు.
ఎస్సీ ఆర్డినెన్సుకు మంత్రి వర్గం ఆమోదం - మంత్రి నిమ్మల రామానాయుడు
మతసామరస్యాన్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నాలు చేశారన్నారు. ప్రార్ధనా స్ధలంలో ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మద్యం కుంభకోణంలో సిట్ విచారణ జరుగుతోందని, తప్పుచేసిన వారిని తప్పక శిక్షపడుతుందని చెప్పారు. పవన్ కల్యాణ్ పర్యటన వల్ల విద్యార్థులు ఎగ్జామ్‌కు లేట్ అయ్యారనీ జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తేలిందని అన్నారు. ఉత్తరాంధ్రలో క్రైం ఎక్కువ నమోదు కావడం లేదని ఎప్పటికప్పుడు నేర నియంత్రణకు సాంకేతిక పరిజ్జానాన్ని వాడుతున్నామని వెల్లడించారు.
48 గంటల్లో ధాన్యం డబ్బులు జమ: క్రమ పద్ధతిలో కేబినెట్ సమావేశాలు పెడుతూ ప్రజలకు అవసరమైన నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గతంలో నియంతృత్వ ధోరణితో పాలన సాగిందని మండిపడ్డారు. రైతులకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ధాన్యం డబ్బులు ఎప్పుడూ పడతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని మంత్రి వెల్లడించారు. వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా కొందరు చేస్తున్న ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం తిప్పి కొడుతుందని మంత్రి తేల్చిచెప్పారు.
కుల, మత ప్రాంతాలను జగన్ రెచ్చగొడుతున్నారు - సీఎం చంద్రబాబు ఆగ్రహం