High Tension At Bommireddypalli At Kurnool District: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతేడాది జూన్ 9వ తేదీన టీడీపీ నాయకుడు గిరినాథ్ చౌదరిని వైఎస్సార్సీపీ వర్గీయులు దారుణంగా వేట కొడవళ్లతో నరికి హత్య చేశారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ హత్యతో దాదాపు 36 మంది వైఎస్సార్సీపీ వర్గీయులు గ్రామం వదిలి వెళ్లిపోయారు.
ఆ తరువాత కాలంలో తాము గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా వైఎస్సార్సీపీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. అందుకుగాను పోలీసు బందోబస్తుతో గ్రామంలోకి వెళ్లేందుకు హైకోర్టు ఈ మధ్యనే అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో 31 మంది వైఎస్సార్సీపీ వర్గీయులు పోలీసు బందోబస్తు నడుమ ఇవాళ గ్రామంలోకి చేరుకున్నారు. వీరిని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు.
వైఎస్సార్సీపీ నాయకుడి కారుపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు.
అనంతలో వైఎస్సార్సీపీ నాయకుల దుశ్చర్య - టీడీపీ కార్యకర్త దారుణ హత్య - tdp leader murder in anantapur