High Court Dismisses YSRCP MP Mithun Reddy Anticipatory Bail Petition : వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ స్కాం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇటీవల తీర్పును రిజర్వ్ చేసి నేడు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. మద్యం విక్రయాలు, సరఫరాలో అవినీతి జరిగిందని గతంలో సీఐడి కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా పలువురు నుంచి 164 స్టేట్మెంట్ ప్రకారంగా వాంగ్మూలం తీసుకుంది.
ఈ కేసులో తనను ఆరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ ముందస్తు బెయిలు కోసం మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్ద్ లూత్రా, పీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. మద్యం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడుగా చేర్చలేదని నోటీసులు కూడా ఇవ్వలేదని వాదనలు వినిపించారు. ఈ దశలో ముందస్తు బెయిలు పిటిషన్ వేయటం సరి కాదని, పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరారు.
గత ప్రభుత్వ హయంలో పనిచేసిన సత్యప్రసాద్ అనే అధికారి ఇచ్చిన 164 స్టేట్మెంట్ ఆధారంగా కేసులో పిటిషనర్ పేరు చేరుస్తారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను కారణంగా చూపుతూ ముందస్తు బెయిలు పొందలేరని వాదనలు వినిపించారు. పిటిషనర్ తండ్రికి శస్త్ర చికిత్స జరిగిందని ఆయనను చూసేందుకు వెళితే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
అలాగే ఏప్రిల్ 4 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలకు వెళితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. గత విచారణలో వాదనలు విన్న న్యాయస్థానం ఏప్రిల్ 3 వరకు పిటీషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. తాజాగా పిటిషనర్ బెయిలు పిటీషన్ కొట్టివేస్తూ నేడు తీర్పు నిచ్చింది.
పుంగనూరులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటన - ఉద్రిక్తత
రాష్ట్రంలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం - మిథున్‌రెడ్డి ప్రశ్నకు గడ్కరి వివరణ