Heavy Traffic Jam at Tank Bund Due to Ganesh Immersion : గణేశ్ నిమజ్జనం మొదలైంది ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచాయి. వచ్చే వినాయకులతో ఎక్కడిక్కడ రద్దీ నెలకొంది. ట్యాంక్‌బండ్ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తొమ్మిది రోజులు పూర్తయిన నేపథ్యంలో గణేశ్ విగ్రహాలను నిమజ్జనానికి తీసుకువస్తున్నారు.
ట్రాఫిక్ అంక్షలు, దారి మళ్లింపుతో ట్రాఫిక్ నిలిచిపోయింది. 20 నిమిషాల ప్రయాణానికి సుమారు గంట సమయం పడుతోంది. పోలీసుల పర్యవేక్షణ లేక వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంజే మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం నుంచి బుధవారం వరకు ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం కారణంగా భారీగా ట్రాఫిక్ ఉంటుంది. దీంతో దారి మళ్లింపులు చేశారు అధికారులు.