ETV Bharat / state

హైదరాబాద్​లో రాత్రి భారీవర్షంతో జలమయమైన రహదారులు - మరో 3 రోజులు ఇదే పరిస్థితి - HEAVY RAINS IN HYDERABAD

హైదరాబాద్​లో రాత్రి భారీవర్షం - లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వాన నీరు -బండ్లగూడలో 87.3 మి.మీ.ల వర్షం

Heavy Rains in Hyderabad
Heavy Rains in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2025 at 7:43 AM IST

Updated : May 22, 2025 at 8:05 AM IST

2 Min Read

Heavy Rains in Hyderabad : ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి నగరం తడిసిముద్దయ్యింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విధులు ముగించుకుని ఇళ్లకు చేరాల్సిన వారంతా వర్షంలో తడిసి ముద్దయ్యారు. మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాని అధికారులు సూచించారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం : ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌ వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. అనేక ప్రాంతాలో రోడ్లపైకి నీరు చేరడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాయంత్రం తర్వాత వర్షం పెరగడంతో రోడ్లపై ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ఉప్పల్, రామంతాపూర్, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, సంతోష్‌నగర్‌, పాతబస్తీ సహా దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా కొన్నిచోట్ల చెట్లు విరిగిపడడంతో పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Heavy Rains in Hyderabad
హైదరాబాద్​ నగరంలో పలు ప్రాంతంలో నమోదైన వర్షపాతం (ETV Bharat)

నగరంలో కురిసిన వర్షం కారణంగా కార్యాలయాలు, పని ప్రదేశాల నుంచి విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం పడుతూనే ఉండటంతో మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు ట్రాఫిక్‌ జామ్ సమస్య ఎక్కువయ్యింది. దీంతో చాలా మంది మెట్రోనూ ఆశ్రయించారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి.

ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికుల ఇబ్బందులు : రాత్రి కురిసిన భారీ వర్షానికి మోండా మార్కెట్​లో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు . ఈ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. ట్రాఫిక్‌ సమస్యలు, విద్యుత్తు అంతరాయాలు ఏర్పడ్డాయి.

30 నిమిషాల వ్యవధిలో సర్కిల్​ 7 లోని బండ్లగూడలో 87.3 మి.మి., అస్మాన్‌ఘడ్‌లో 82.5, మలక్‌పేటలో 82.3, సరూర్‌నగర్‌లో 77.8, ముసారాంబాగ్‌లో 75.8, ఎల్బీనగర్‌లో 69.0, చంపాపేటలో 66.3, హిమాయత్‌నగర్‌లో 61.0 మి.మీ. వర్షం పడింది. చాదర్‌ఘాట్‌ ఆర్‌యూబీ కింద వరద ప్రవహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

మూడు రోజుల పాటు వర్షాలు : మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. రహదారులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్లపై మ్యాన్‌హోళ్లు తెరుచుకునే అవకాశం ఉండడంతో వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని వివరించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం - మంత్రి హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం

Last Updated : May 22, 2025 at 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.