Heavy Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు తడిసిముద్దయ్యారు. నగరంలోని పలు రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఉదయం నుంచి ఎండవేడిమితో అల్లాడిన నగరవాసులు సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.
నాలుగు రోజులు పొడి వాతావరణం : రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల వైపు తేమ వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు చెప్పింది. ఈ నాలుగు రోజులు పొడి వాతావరణంతో పాటు ఎక్కువగా ఉక్కపోత ఉంటుందని తెలిపింది. ఈ వాతావరణం పూర్తిగా మారిన తర్వాత నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. కానీ ఇప్పుడు నగరంలో భారీ వర్షం పడటంతో ఉదయం నుంచి ఉన్న వేడికి జనాలు ఉపశమనం పొందారు.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం - అధికారులు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశం