Heavy Rain Alert in AP : బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో దక్షిణ అరేబియా, మాల్దీవులు, కొమోరిన్ సహా బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. మధ్య మహారాష్ట్ర సహా అంతర్గత కర్ణాటక రాయలసీమ వరకూ 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పాడింది.
ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా కర్ణాటక వరకూ మరో ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో పాటు ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి.
