Benefits of Drinking Pot Water : వేసవికాలం రాగానే అందరూ చల్లటి నీళ్లే కావాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్లే ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్లను వాడుతున్నారు. కానీ ఓ 2 దశాబ్దాల వెనక్కి వెళితే ఫ్రిజ్ అనేది అందరి ఇళ్లల్లో ఉండే వస్తువు కాదు. అప్పట్లో ప్రతి ఇంట్లో మట్టి కుండలే దర్శనం ఇచ్చేవి. ఆ మట్టి కుండలనే వంటలతో పాటు నీళ్ల కోసమూ ఉపయోగించేవాళ్లు.
ఆ మట్టి కుండలోని నీళ్లు ఎంతో చల్లగా ఉండేవి. అంతే కాదు ఆరోగ్యపరంగా కూడా మట్టి కుండతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇప్పటి తరం మళ్లీ పాత కాలానికి మారుతూ మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలు ఏంటి? శరీరానికి మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

- చలికాలం నుంచి వేసవి కాలానికి మారగానే ఒక్కసారిగా ఫ్రిజ్లో నీళ్లు తాగితే సున్నితంగా ఉండే గొంతు తట్టుకోలేదు. శరీర ఉష్ణోగ్రత పెరిగి జలుబు, దగ్గు వంటివి తలెత్తుతాయి.

- వేసవిలో దప్పిక తీరక చల్లటి నీళ్ల కోసం ఫ్రిజ్ని ఆశ్రయిస్తారు చాలా మంది. కానీ మట్టి కుండలో నీళ్లే ఆరోగ్యానికి మంచివని అంటున్నారు నిపుణులు.

- మట్టిలో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ల శక్తి ఉంటుంది. అది మట్టి కుండలో నిల్వ చేసిన నీటికి చేరుతుంది. ఆ నీటిని తాగడం వల్ల వేసవి ఎండకి కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది.
- వేసవిలో జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించేందుకు మట్టి పాత్రల్లో నిల్వ చేసిన నీళ్లు సాయపడతాయి. ఫలితంగా ఎసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి.

- నీళ్లనే కాకుండా మజ్జిగ, లస్సీని కూడా మట్టి పాత్రల్లో నిల్వ ఉంచొచ్చు. మట్టి పాత్రలోని ఖనిజాల కారణంగా అవి మరింత రుచిగా మారుతాయి.

- మట్టి కుండలోని నీటిలో సహజసిద్ధమైన ఆల్కలీన్లు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తాయి. పీహెచ్ విలువను స్థిరంగా ఉంచడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.

- మట్టి కుండలు కేవలం నీటిని చల్లబరచడానికే కాదు, నీటిని శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అవి బయట ఉష్ణోగ్రతకు తొందరగా వేడెక్కుతాయి. వీటికి బదులు మట్టి సీసాల్లో నీళ్లను తీసుకెళ్లడం ఎంతో ఉత్తమం.
Clay Pot Water Health Benefits : మట్టి కుండలోని నీళ్లు తాగితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
మట్టికుండా మజాకా - వేసవిలో సమ్మర్ పాట్స్కు సూపర్ క్రేజ్ - Clay Pots Demand in Market