Harmful Effects Of Spitting In Public Places : ఉమ్మి సాధారణంగా ఎవరికైనా వస్తుంది. అయితే ఎక్కడ ఉమ్మాలనేది తెలిసి ఉండాలంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం మనం రోడ్లపై, ఆరు బయట ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేసే వారిని చాలా మందిని చూస్తూనే ఉన్నాం. అయితే ఇది ఎంతో ప్రమాదకరమని, చట్టరీత్యా నేరమని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల కలిగే అనర్థాలపై నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్బీఎస్కే వైద్య అధికారి డాక్టర్ నితిన్ ప్రసాద్ రాయ్ పలు విషయాలు పంచుకున్నారు.
- లాలాజలం ఫ్లూ, జలుబు, శ్వాసకోశ, క్షయ వ్యాధి వైరస్‌లను కలిగి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంతో ఆ వైరస్‌లు ఇతరుల్లో చేరి అనార్యోగాన్ని కలిగించే ప్రమాదం ఉంది.
- వైరస్‌లు కలిగి ఉన్న వారు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంతో ఆ తుంపర్లు వివిధ వస్తువులపై పడి వాటిని ఇతరులు తాకడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
- అనేక మంది వాహనాలపై ప్రయాణం చేస్తూ ముందూ వెనుకా చూసుకోకుండా రహదారిపైనే ఉమ్ము వేస్తుంటారు. ఇలాంటి టైంలో ఆ ఉమ్ము గాలికి వెనుక వచ్చే, పక్క నుంచి వెళ్లే వాళ్లపై పడడం వల్ల జుగుప్సాకరంగా భావిస్తున్నారు. సామాజిక కోణంలో రహదారిపై ఉమ్మి వేయడం అత్యంత హీనమైన చర్య అని అనేక మంది అనుకుంటారు.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం అనేది చట్టరీత్యా నేరం. స్థానిక సంస్థలు ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉంది. పలు రద్దీ ప్రాంతాలనే ఉమ్మి వేయకూడదని ప్రాంతాలుగా గుర్తించవచ్చు.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల కలిగే అనర్థాలపై అధికారులు, డాక్టర్లు ప్రజలకు తరచూ అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలి.