GVMC Announces 5 Percent Discount on Property Taxes: విశాఖలో ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్నులపై 5 శాతం రాయితీ ఇస్తున్నట్లు జీవీఎంసీ (Greater Visakhapatnam Municipal Corporation) ప్రకటించింది. 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిమాండ్‌తో సంబంధం లేకుండా పన్నును ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించి 5 శాతం రాయితీ పొందొచ్చని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇంచ్చార్జీ కమిషనర్ ఎంఎన్. హరేంధిర ప్రసాద్ వెల్లడించారు.
ఆస్తి పన్నుల చెల్లింపులకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సెంటర్‌తో సహా అన్ని జోనల్ కార్యాలయాల్లోని కేంద్రాలలో ఈ సౌకర్యం ఉందని అన్నారు. అన్లైన్ లోనూ చెల్లింపులకు వెసులుబాటు ఉందని వివరించారు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా ఈ కేంద్రాలు పని చేస్తాయని వెల్లడించారు. ఆస్తిపన్ను చెల్లింపు దారులు gvmc.gov.in-property tax - bharat QR code ద్వారా ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.
ఇంక జీవీఎంసీ సౌకర్యం కేంద్రాల్లో నగదు, డిడి, చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చని అలానే ఐడీబీఐ సిరిపురం బ్రాంచ్, ఐసీఐసీఐ ద్వారకా నగర్ బ్రాంచ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధురవాడ బ్రాంచ్, యాక్సిస్ బ్యాంక్ రాంనగర్ బ్రాంచ్‌లలో నగదు, డీడీ, డెబిట్ /క్రెడిట్ కార్డుల ద్వారా వార్డు సచివాలయాల్లో డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.