Gorantla Madhav Into Police Custody : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని ఆయన అడ్డగించారు. అంతేకాక అతని అంతు చూస్తామని బెదిరించారు. కిరణ్‌ను మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు వరకూ పోలీసు వాహనాన్ని మాధవ్ వెంబడించారు. ఈ క్రమంలో విధులను అడ్డుకుంటున్నారని మాజీ ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిదంటే : సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల విషయంలో సొంత పార్టీ శ్రేణులనూ టీడీపీ ఉపేక్షించడం లేదు. ఎవరు నోరు జారినా తప్పేనని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చేసి చూపిస్తోంది. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఈ మేరకు పోలీసులు కిరణ్‌పై కేసు నమోదు చేశారు.
కిరణ్ హైదరాబాద్ నుంచి ఓ వాహనంలో వస్తున్నారనే సమాచారంతో మంగళగిరి గ్రామీణ పోలీసులు ఇబ్రహీంపట్నం వద్ద అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గతంలో రిషికొండ ప్యాలెస్‌పై తాను చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తనకు మంచి గుర్తింపు లభించిందని, మళ్లీ అలాంటి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కిరణ్ పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కేవలం గుర్తింపు కోసమే తానీ వ్యాఖ్యలు చేశానని, ఇందులో ఎవరి ప్రమేయమూలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతకుముందు వైఎస్ భారతిని కిరణ్ క్షమాపణలు కోరాడు.
Chebrolu Kiran Case Updates : మరోవైపు సామాజిక మాధ్యమాల్లో గాడి తప్పిన వ్యక్తులను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో అనేక చర్యలు చేపట్టింది. నేడు వైఎస్ జగన్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అంశాన్ని కూడా అంతే సీరియస్‌గా తీసుకుని చర్యలకు దిగింది. వ్యక్తులపై, వారి కుటుంబ సభ్యులపై ఎవరు కించపరిచేలా, జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసినా వారు ఏ పార్టీకి చెందిన వారైనా వారిపై సర్కార్ చాలా కఠినంగా వ్యవహరిస్తుందని తాజా అరెస్ట్ ద్వారా మరోసారి స్పష్టమైంది.
వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు - టీడీపీ కార్యకర్త అరెస్ట్
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి: మంత్రి కొల్లు రవీంద్ర