Aksharabhyasam in GOVT School Nalgonda : వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఒక వైపు పిల్లలు బడికి వెళ్లం అంటూ మారాం చేస్తుంటే, మరోవైపు పిల్లల్ని మొదటిసారి బడికి పంపేందుకు తల్లిదండ్రులు కసరత్తులు చేస్తున్నారు. దీంతో ఒకటో తరగతిలో చేరే విద్యార్థులకు విద్యాభ్యాసాలు చేస్తున్నారు. అక్షరాభ్యాసం మన సంస్కృతిలో భాగం. చిన్నారులు విద్య నేర్చుకోవడానికి ముందు జరుపుకునే కార్యక్రమం ఇది. దీనిని కుటుంబసభ్యులు నిర్వహిస్తారు.
అయితే నల్గొండ జిల్లాలోని పానగల్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాత్రం నూతనంగా చేరే విద్యార్థిని, విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఉపాధ్యాయులే సామూహికంగా, ఘనంగా నిర్వహించారు. స్కూల్లో చేరిన చిన్నారులకు టీచర్లు పలకలపై అక్షరాలు దిద్దించారు. చిన్నారులకు పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొనారు.
నూతన విద్యా సంవత్సరం షెడ్యూల్ విడుదల - ఐదు నిమిషాలు ధ్యానం, అరగంట కథలు!