Groom Stopped Marriage For Dowry : తనకు ఇచ్చే వరకట్నం, భూమి ఇచ్చేలా ముందస్తు ఒప్పంద పత్రం రాసివ్వకుంటే పెళ్లి జరగదని వరుడు తెగేసి చెప్పడంతో పీటలపై వివాహం ఆగిపోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచిలో చోటుచేసుకుంది. మండలంలోని రెండు వేర్వేలు గ్రామాలకు చెందిన యువతి, యువకుడు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకునేందుకు ఇరువర్గాల పెద్దలనూ ఒప్పించారు. వరకట్నంగా కొంత నగదు, ఎకరం భూమి ఇస్తామని వధువు తల్లిదండ్రలు చెప్పారు. నగదులో నుంచి కొంత మొత్తం వరుడికి అందించారు.
పొరుగు జిల్లాలోని ఒక ప్రముఖ ఆలయంలో బుధవారం రాత్రి పెళ్లి వేడుక మొదలైంది. జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో వరుడు వేడుకను ఆపి, తన డిమాండ్లను వధువు తరఫు పెద్దల ముందుంచాడు. 'మిగిలిన నగదు, ఎకరం భూమి ఎప్పుడిస్తారో ఒప్పంద పత్రం రాసివ్వండి అప్పుడే పెళ్లి జరుగుతుంది' అని వారిని డిమాండ్ చేశాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వధువు తరఫు వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారని ఎస్సై నాగరాజు తెలిపారు. కేసు నమోదుకు మాత్రం వారు అంగీకరించలేదని చెప్పారు.
MLA Helps to Bridegroom : 'బైక్' కోసం ఆగిన పెళ్లి.. MLA సాయంతో ఒక్కటైన జంట
wedding called off at last minute : కాసేపట్లో పెళ్లి.. కనిపించకుండా పోయిన వధువు.. కట్ చేస్తే..!