ETV Bharat / state

కర్నూలు అడవుల్లో గ్రీన్​కో విధ్వంసం -140 ఎకరాల్లో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు - GreenCo Company

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 11:32 AM IST

Updated : Jul 18, 2024, 12:28 PM IST

GreenCo Company Environmental destruction in Kurnool District : గ్రీన్​కో సంస్థ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యావరణ విధ్వంసం చేసింది. 140 ఎకరాల మేర అటవీ భూములను ఆక్రమించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అడవుల్లో నిర్మాణాలు చేపట్టింది. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

greenco_company
greenco_company (ETV Bharat)

GreenCo Company Environmental destruction in Kurnool District : పర్యావరణహితం అని చెప్పుకునే ఆ కంపెనీ పర్యావరణ విధ్వంసానికి తెగించింది. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్‌ పేరుతో అటవీ భూముల్ని నాశనం చేసింది. ప్రభుత్వం కేటాయించిన భూములకు పక్కనే ఉన్న అటవీ భూముల్ని కలిపేసుకుంది. అడవుల్లో భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఎవరినీ రానీయకుండా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తోంది.

ఇష్టారాజ్యంగా నిర్మాణాలు : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, పాణ్యం మండలాల పరిధిలో గ్రీన్-కో సంస్థ ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీని కోసం గుమ్మితం తాండా, పిన్నాపురం గ్రామాల పరిధిలో భూసేకరణ చేపట్టింది. 2022 మే 17న అప్పటి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. 5 వేల 410 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని అడవుల విధ్వంసానికి తెగపడ్డారు. అటవీశాఖ అనుమతులు తీసుకోకుండానే రోడ్లు వేశారు. కొండల్ని తవ్వేసి గుళ్లచేశారు. ప్రాజెక్టు పనులు చేసే కార్మికుల కోసం తాత్కాలిక షెడ్లు వేశారు. యంత్రసామాగ్రి నిలిపేందుకు నిర్మించిన తాత్కాలిక గ్యారేజీలకూ అటవీశాఖ నుంచి అనుమతి లేదు. ఇదే విషయాన్ని కర్నూలు అటవీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

మాయమవుతోన్న ఎర్రమట్టి దిబ్బలు- గత ప్రభుత్వ ఉత్తర్వులపై పర్యావరణవేత్తల ఆందోళన - visakha erra matti dibbalu

వైఎస్సార్సీపీ నాయకుడు అండతో : గ్రీన్‌ కో ఇంటిగ్రేటెడ్ రిన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ గత తెలుగుదేశం హయాంలోనే రాష్ట్రానికి వచ్చింది. 2019లోనే నాటి ప్రభుత్వం 903 ఎకరాల్ని ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయీంచింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ గత ప్రభుత్వం కేటాయించిన భూములు సరిపోకపోతే అదనంగా భూమి కావాలని ప్రభుత్వానికి సవివరంగా దరఖాస్తు చేసుకోవాలి. గ్రీన్‌ కో అలాంటిదేమీ చేయకుండానే అటవీ భూమిని యథేచ్ఛగా వాడుకుంటోంది! దీనికి కారణం గ్రీన్‌ కో ఎండీ, సీఈవో అనిల్ సోదరుడు చలమలశెట్టి సునీల్ వైఎస్సార్సీపీ నాయకుడు కావడమే.

" 140 ఎకరాల అటవీ భూమిని ఎవరికి చెప్పకుండా అన్యాక్రాంతం చేశారు. వారు రోడ్లు వేస్తున్నారు. వారి అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇది చూస్తూ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం వైఎస్సార్సీపీ అనుచరుడు ఈ ప్రాజెక్ట్​కు ఎండీగా వ్యవహరించడమే. ఈ ప్రాజెక్ట్​ కర్నూలు, నంద్యాల జిల్లాలో మధ్యలో ఉండటం కారణంగా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు"_గౌస్ దేశాయ్, కార్మిక సంఘం నాయకుడు

గనుల లీజుల దస్త్రాలు భద్రమేనా - అనుమానాలు రేకెత్తిస్తున్న అధికారుల తీరు! - Mines Department Lease Records

140 ఎకరాలు ఆక్రమణ : వైఎస్సార్సీపీ నేతకు చెందిన ప్రాజెక్ట్‌ కావడంతోనే నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నా అధికారులు నోరు మెదపలేదు. ఇదే అదనుగా గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు కేటాయించిన భూములకన్నా 140 ఎకరాలు అదనంగా వినియోగించుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కొలతలు వేయించిన అధికారులు గ్రీన్‌ కో అటవీ భూములను ఆక్రమణను నిర్థరించారు. అటవీ భూములను ఆక్రమించుకుని, పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన గ్రీన్ కో సంస్థపై చర్యలకు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రజల సొమ్ము సర్వే రాళ్లపాలు- రూ.525 కోట్లు మంచినీళ్లలా వెచ్చించిన ఏపీఎండీసీ - LAND RESURVEY stones

Last Updated : Jul 18, 2024, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.