National Greenfield Highway in Vizianagaram District: విజయనగరం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే- 33సీడీపై జామి వద్ద ఇంటర్ ఛేంజ్ రింగ్ రోడ్డు పూర్తయింది. చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో నల్లగా సరళరేఖలా ఉన్న హైవే పైకి చేరాలన్నా, రెండు వైపులకు వెళ్లాలన్నా ఈ ఇంటర్ ఛేంజే ఆధారం. గంట్యాడ, జామి, ఎస్.కోట మండలాల రాకపోకలకు ఉద్దేశించిన ఈ రింగ్ రోడ్డు ప్రస్తుతం ఆ ప్రాంత ముఖచిత్రాన్నే మార్చేసింది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్ నుంచి విశాఖపట్నం వరకు 6 వరుసలుగా నిర్మిస్తున్న హైవేతో ఆయా మండలాలకు కొత్త కళ వచ్చింది. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం కొర్లాం నుంచి కొత్తవలస మండలం కంటకాపల్లి వరకు చేపట్టిన రహదారి పనులను పూర్తి చేసినట్లు రహదారి ఇన్‌ఛార్జి రాజశేఖరం వెల్లడించారు.
తుది దశలో గ్రీన్‌ఫీల్డ్ హైవే - ఆ మూడు రాష్ట్రాల మధ్య సౌకర్యవంతమైన రవాణే లక్ష్యంగా!