Govt Orders on Allocation of Land for LuLu Group: విశాఖలో లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా లులూ గ్రూప్‌కు విశాఖలో భూకేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్‌లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
లులూ గ్రూప్ సంస్థ విశాఖ నగరంలో అంతర్జాతీయ స్థాయి మాల్ నిర్మాణం పెట్టుబడులకు ఎస్ఐపీబీలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ వెల్లడించింది. 2017లోనే విశాఖ బీచ్ రోడ్ లోని హార్బర్ పార్కులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లులూ గ్రూప్ ముందుకు వచ్చింది. 2023లో లులూ గ్రూప్‌కు చేసిన భూకేటాయింపులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం మళ్లీ షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణం కోసం లులూ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించి భూ కేటాయింపులు చేయాల్సిందిగా ఏపీఐఐసీని పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.
Lulu Group Chairman Met Chandrababu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మధ్యలో ఆగిపోయిన చాలా పరిశ్రమలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు కూడా సర్కార్ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ఇప్పటికే సంప్రదింపులు కొనసాగుతుండగా, మరోవైపు నూతన ఇండ్రస్టీస్, పెట్టుబడులు రాబట్టేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో 5 సంవత్సరాలుగా ఉపాధి అవకాశాలు లేక నానావస్థలు పడిన నిరుద్యోగులకు కూటమి రాకతో ఆశలు చిగురిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి తరిమేసిన లులు సంస్థ సీఎం చంద్రబాబు చొరవతో మళ్లీ తిరిగి ఏపీకి రానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రితో లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో మాల్, హైపర్ మార్కెట్ ఏర్పాటుపై చంద్రబాబుతో వారు చర్చించారు. విజయవాడ, వైజాగ్, తిరుపతిలోనూ మల్టీప్లెక్స్‌ల ఏర్పాటుపై చర్చ సాగింది.
విశాఖలో లులు మాల్ - అమరావతి, తిరుపతిలోనూ!
"లులు" ఈజ్ బ్యాక్ - ఆ మూడు నగరాల్లో భారీగా పెట్టుబడులపై సీఎంతో చర్చ - Lulu Investments in AP