ETV Bharat / state

మీ వెహికల్ నెంబర్ ప్లేట్ మార్చడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే? - మార్చకుంటే అన్నీ బంద్! - HIGH SECURITY NUMBER PLATE IN TG

పాత వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ - ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా బిగించుకోవాల్సిందే - లేదంటే బీమా సహా అన్ని సేవలూ బంద్‌ అయ్యే అవకాశం

High Security Registration Plates
High Security Registration Plates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 18, 2025 at 9:19 PM IST

2 Min Read

High Security Registration Plates in Telangana : రాష్ట్రంలోని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 2019 ఏప్రిల్‌ ఒకటో తేదీ తరువాత తయారైన వాహనాలకు మాత్రమే హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉండగా తాజాగా 2016 ఏప్రిల్‌ ఒకటికి ముందు తయారైన అన్ని వాహనాలకు కూడా హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్లు బిగించుకోవాలని రవాణాశాఖ ఉత్తర్వుల్లో వెల్లడించారు.

చేయకుంటే ఇబ్బందులే : కొత్తగా వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్లను అమర్చుతున్నారు.ప్రస్తుతం కొత్తగా ఆదేశాలు రావడంతో 2016 ఏప్రిల్‌కు ముందు తయారైన వాహనాలకు కూడా కచ్చితంగా హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్లను బిగించాల్సిందే. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 30 లోగా అన్ని రకాల వాహనాలకు కొత్త నెంబర్‌ ప్లేట్లను బిగించుకోవాలని గడువు విధించారు. ఆ తరువాత కొత్త నెంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు రోడ్డు ఎక్కితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. వాహనాల రకాలను బట్టి నెంబర్‌ ప్లేటుకు కనిష్ఠంగా రూ.320, గరిష్ఠంగా రూ.800 వరకు ఛార్జీలను ఖరారు చేశారు అధికారులు. ఈ నెంబర్‌ ప్లేటు ఉంటేనే వాహనానికి సంబంధించి బీమా, సామర్థ్యం, కాలుష్య ధ్రువీకరణ పత్రాలతో పాటు రవాణాశాఖ నుంచి ఇతర సేవలను పొందే వీలు ఉంటుంది. సాధారణ వాహనదారులంతా తప్పనిసరిగా హెచ్ఎస్ఆర్ ప్లేట్లు బిగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాహనాలకు బీమా, రిజిస్ట్రేషన్, కాలుష్య ధ్రువపత్రం తదితర సేవలు నిలిపివేసే అవకాశం ఉంది. వాటిని కొనాలన్నా, అమ్మాలన్నా ఇబ్బందులు తప్పవు. తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. వాహనాలకు నూతన నెంబర్‌ ప్లేట్లను బిగించుకోవాలనుకునే వాహనదారులు www.siam.in వెబ్‌సైట్‌లో వాహనం వివరాలను నమోదు చేసుకొని బుక్‌ చేసుకోవాలి.

ఎలా నమోదు చేసుకోవాలంటే : -

  • పాత వాహనానికి కొత్తగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
  • www.siam.in అనే వెబ్ సైట్​లో బుక్ హెచ్ఎస్ఆర్పీ ఆప్షన్ క్లిక్ చేసి, పేరు, వాహన నంబర్, చరవాణి, జిల్లా వివరాలను నమోదు చేయాలి.
  • తరువాత వాహన రకం కంపెనీ ఎంపిక చేసుకోవాలి.
  • తరువాత హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విత్ కలర్ స్టిక్కర్ ఎంపిక చేసుకొని, వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి, నిర్దేశిత రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
  • అనంతరం కొత్త నంబరు ప్లేటు వచ్చాక, దాన్ని వాహనానికి బిగించి ఫొటో తీసి అదే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలనే నిబంధన విధించారు.
  • అయితే చదువురాని వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంది.

మీరు 2019కి ముందు బండి వాడుతున్నారా? - అయితే నంబర్​ ప్లేట్​ మార్పించాల్సిందే - లేదంటే?

మీ బైక్‌/కార్‌కు VIP నంబర్‌ కావాలా? సింపుల్‌గా బుక్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.