Govt Employee Attack on Toll Staff : టోల్ వద్ద డబ్బులు అడినందుకు టోల్ సిబ్బందిపై ఓ ప్రభుత్వ ఉద్యోగి, అతడి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది.
వివరాల్లోకి వెళితే : రాజేంద్రనగర్ ఎగ్జిట్ 17 వద్ద టోల్ వద్ద డబ్బులు అడిగినందుకు టోల్ సిబ్బందిపై జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హుస్సేన్ సిద్ధికి తన ఐడీ కార్డు చూపించి టోల్ మినహాయింపు కోరారు. అయితే ఆ శాఖకు టోల్ మినహాయింపు లేకపోవడంతో టోల్ సిబ్బంది డబ్బులు చెల్లించాలని కోరారు.
దీంతో ఆగ్రహానికి గురైన హుస్సేన్ సిద్ధికి, అతని కుటుంబ సభ్యులు వాహనాన్ని ఆపుతావా అంటూ టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వారిని ఆపేందుకు ప్రయత్నించిన ఇతర టోల్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది. ఈ ఘటనపై టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అనంతరం పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.
టోల్ రుసుములు తగ్గాయ్ - నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి
ఆ మట్టి రోడ్డుపై వెళితే టోల్ ఛార్జీ కట్టాల్సిందే - బైక్‌లకూ మినహాయింపు ఉండదు