ETV Bharat / state

విద్యార్థులూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే! - GOOD SLEEP FOR GOOD HEALTH

విద్యార్థులకు తగినంత నిద్ర లేకపోతే ఎన్నో సమస్యాలు వస్తాయంటున్న నిపుణులు - మరి అవేంటో తెలుసుకుందామా!

good_sleep_for_good_health
good sleep for good health (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : November 25, 2024 at 10:51 PM IST

2 Min Read

Good Sleep for Good Health: పరీక్షలొచ్చాయంటే చాలు విద్యార్థులు రాత్రిళ్లు సైతం మేలుకొని చదువుతుంటారు. ఇలా కష్టపడి చదవడం తప్పు కాదు కానీ, శరీరానికి ఎంతో ముఖ్య అవసరమైన నిద్రని నిర్లక్ష్యం చేస్తే అసలుకే ముప్పు. పరీక్షలకు సిద్ధిమయ్యే విద్యార్థులకు సరిపడ నిద్ర లేకపోతే ఆరోగ్య, మానసిక సమస్యలతో పాటు చదివింది గుర్తుండక అకడమిక్‌ పెర్ఫామెన్స్‌పైనా ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.

  • విద్యార్థులకు నిద్ర చాలా అవసరం. సరిపడా గాఢనిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి, అకడెమిక్‌ పెర్ఫామెన్స్‌పైనే కాదు మొత్తంగా వారి ఆరోగ్యంపైనే ప్రభావం ఉంటుంది. రోజూ సరిగా నిద్రపోవడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
  • నాణ్యమైన నిద్ర లేకపోతే విద్యార్థుల్లో శ్రద్ధాశక్తులు, సామర్థ్యం తగ్గుతాయి. దీని వల్ల అకెడమిక్‌ పెర్ఫామెన్స్‌ దెబ్బతింటుంది. ఇంటర్‌, ఆపైన చదివే విద్యార్థులు 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.
  • భావోద్వేగాలను నియంత్రించుకొనేందుకు రాత్రి నిద్ర ఎంతగానో ఉపకరిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
  • జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడంలో కీలక పాత్ర నిద్రదే. చదివే విషయాలను మెదడులో నిక్షిప్తం చేయడం, ప్రాసెస్‌ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి నిద్రపట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తే ముప్పు పెరుగుతుంది. మానసిక కల్లోలం, చిరాకు, భావోద్వేగ అస్థిరత వంటివీ రావడానికి అవకాశం ఉంది.
  • తగినంత నిద్ర లేకపోతే పగటిపూట మగతగా ఉండటం, చురుకుదనం కోల్పోవడం, ఏకాగ్రత రావడం కష్టంగా ఉంటుంది. శరీరానికి నిద్ర రిలాక్సేషన్‌ ఇవ్వడంతో పాటు రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. దీంతో విద్యార్థులు ఆనారోగ్యం బారిన పడే అవకాశం తగ్గుతుంది.
  • నిద్రపోయేటప్పుడు మంచంపైన ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటివి పెట్టుకోవద్దు. నిద్రపోయేముందు వీడియోగేమ్స్‌ వంటివి వాడితే మెదడు ఉత్తేజితమై నిద్ర రాకుండా చేస్తుంది.
  • పడుకునే ముందు ఒత్తిడికి గురిచేసే క్రైం, సస్పెన్స్‌, యాక్షన్‌ సినిమాలు చూడటం కూడా మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఇది విద్యార్థులు కచ్చితంగా పాటించాల్సిన నియమం.
  • తక్కువగా నిద్రపోతున్న విద్యార్థులు తరగతిగదిలో శ్రద్ధ పెట్టలేకపోవడం, మార్కులు సాధించలేకపోవడం, పాఠాలు గుర్తుండకపోవడం, మానసిక సమస్యల వంటివాటి బారిన పడుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • కొందరైతే సెలవే కదా అని ముందురోజు ఎక్కువసేపు మేల్కొని ఉండటం, మరుసటి రోజు పొద్దున్నే లేవకపోవడాన్ని అలవాటుగా మార్చుకుంటుంటారు. సెలవులైనా, పరీక్షలైనా ప్రతిరోజు టైంకి నిద్రపోవడం, మేల్కోవడాన్ని అలవాటు చేసుకుంటే శరీరానికి ఆ పద్ధతి అలవాటై యాక్టీవ్​గా ఉంటారు.
  • పరీక్షల్లో మంచి గ్రేడ్లు సాధించాలన్నా, పరీక్షల్లో, చదువులో పురోగతి సాధించాలన్నా శరీరానికి సరిపడా నిద్ర తప్పనిసరి. ఏది మానుకున్నా సరే నిద్రకు మాత్రం టైం కేటాయించాల్సిందేనని నిపుణులు చెప్తున్నారు.

అటు ఐటీ ఉద్యోగం ఇటు చేపల పెంపకం - రెండు చేతులా సంపాదన

కొలెస్ట్రాల్ శత్రువేమీ కాదు - అసలు సమస్య ఎక్కడుందంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.