ETV Bharat / state

శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళం - బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వేళలు

కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో నిత్య సేవల వివరాలు

gold-silver-donation-to-ttd-and-brahmotsavam-schedule
1.5 Crore Worth Gold and Silver Donation to TTD (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 22, 2025 at 1:45 PM IST

2 Min Read
Choose ETV Bharat

1.5 Crore Worth Gold and Silver Donation to TTD : శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి సోమవారం విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ రామకృష్ణకు స్వామీజీ కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్‌ఛార్జ్ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Brahmotsavam Schedule : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతినిత్యం జరిగే సేవలను నిత్యోత్సవాలు, వారంలో ఒకరోజు జరిగే ఉత్సవాలను వారోత్సవాలు అంటారు. అలాగే మాసోత్సవాలు, వార్షికోత్సవాలు నిర్వహిస్తుంటారు.

నిత్యోత్సవాలు: ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, మంగళ, బుధ, గురువారం ఉదయం 3.45 గంటలకు తోమాల సేవ, 4.45 గంటలకు అర్చన, మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవం, 2.00 గంటలకు డోలోత్సవం, 3.00 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సాయంత్రం 5.00 గంటలకు సహస్రదీపాలంకార సేవ నిర్వహిస్తారు.

వారోత్సవాలు: ప్రతి సోమవారం ఏకాంతంగా విశేషపూజ జరుపుతారు. మంగళవారం ఉదయం 9 గంటలకు అష్టదళ పదాపద్మారాధన సేవను నిర్వహిస్తారు. గురువారం ఉదయం 6.30 గంటలకు తిరుప్పావడ సేవను జరుపుతారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు శ్రీవారికి అభిషేకం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వేళలు
తేదీ ఉదయం -రాత్రి
24.09ధ్వజారోహనం, పెద్దశేష వాహనం
25.09చిన్నశేష, హంసవాహనం
26.09సింహ, ముత్యపు పందిరి
27.08కల్పవృక్ష, స్వల్పభూపాల
28.09మోహిని అవతారం, గరుడవాహనం
29.09హనుమంత వాహనం, స్వర్ణరథోత్సవం
30.09సూర్యప్రభ, చంద్రప్రభ
01.10రథోత్సవం, అశ్వవాహనం
02.10చక్రస్నానం, గజావరోహనం

కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో నిత్య సేవలు ఇలా

సుప్రభాతసేవ, గోపూజ: వేకువజామున 4.00
బిందుతీర్థ అభిషేకం: 4.30 గంటలు
పంచామృతాభిషేకాలు: ఉదయం 5.30 (ప్రథమ కాల), 9.00 (ద్వితీయకాల), 11.00 (తృతీయకాల)
క్షీరాభిషేకం: ఉదయం 7.30, సాయంత్రం 5.45
ప్రమాణం: సాయంత్రం 5.00 గంటలు.
నిత్య కల్యాణం: 11.30 గంటలకు (ప్రత్యేక మండపంలో)
ప్రత్యేక గణపతి హోమం: ఉదయం 7.00, 8.00, 9.00 గంటలు.
సామూహిక గణపతి హోమం: ఉదయం 10 గంటలు.

నిజరూప దర్శనం:

ఉదయం: 7-7.30, 8.30-9.00, 10.30-11.00, సాయంత్రం: 4.30- 5.00

సర్వదర్శనం:

ఉదయం: 6- 7, 8-8.30, 9.30 -10.30, మధ్యాహ్నం: 12.00 సాయంత్రం: 4.30, రాత్రి: 7-9 గంటలు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు!- సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం- పూర్తి షెడ్యూల్ ఇదే!
ముక్కంటి ఆలయంలో

ఉదయం: 5.30: సుప్రభాత సేవ
5.45: గోమాత పూజ
6.30: ప్రథమ కాలాభిషేకం
7.30: ద్వితీయ కాలాభిషేకం
11.00: నిత్యోత్సవం, చండీ, రుద్రహోమాలు
11.30: నిత్య కల్యాణం
సాయంత్రం: 4.00: ప్రదోషకాలాభిషేకం
రాత్రి : 7.00: నీరాజన మంత్రపుష్పం
9.00: ఏకాంతసేవ
సర్వదర్శనం: ఉదయం 6.00
రాత్రి: 9 గంటలు.

రాహు, కేతు పూజలు:

ఉదయం : 6 నుంచి సాయంత్రం
5 గంటల వరకు
అభిషేకాలు: శ్రీమృత్యుంజయ శివలింగానికి (సోమవారం), కాలభైరవునికి (మంగళవారం), శ్రీమేధా దక్షిణామూర్తికి (గురువారం), శనిభగవానునికి (శనివారం), సూర్యనారాయణమూర్తికి (ఆదివారం).

శుక్రవారం: మనోన్మణికి ఊంజల్‌సేవ

  • త్రయోదశి నాడు ప్రదోష మూర్తులకు విశేష అభిషేకాలు, పున్నమికి ఊంజల్‌సేవ, అమావాస్యకు ఉత్సవమూర్తుల ఊరేగింపు.
  • 22వ తేదీ నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయంలో దేవీ నవరాత్రి వార్షికోత్సవాలు. ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో శ్రీజ్ఞానప్రసూనాంబిక ఉత్సవమూర్తికి అలంకరణలు. ఆలయంలోనే ప్రాకారోత్సవాలు. ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయనున్న బొమ్మల కొలువు.

తిరుమల బ్రహ్మోత్సవాలు - భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు: బీఆర్​ నాయుడు